రంగ‌స్థ‌లం రికార్డ్ సేఫ్‌!

రంగ‌స్థ‌లం రికార్డ్ సేఫ్‌!

రంగ‌స్థ‌లం సినిమా బాక్సాఫీస్ సంచ‌ల‌నాల గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. రామ్ చ‌ర‌ణ్ మార్కెట్‌ను బ‌ట్టి చూస్తే ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ మార్కును ట‌చ్ చేస్తేనే ఔరా అనుకున్నారంద‌రూ. కానీ ఏకంగా రూ.128 కోట్ల షేర్‌తో ఔరా అనిపించింది. ఎంత‌మంచి టాక్ తెచ్చుకున్న్ప‌టికీ రిలీజైన మూడో వారం నుంచి థియేట‌ర్లు ఖాళీ అయిపోయే రోజుల్లో రంగ‌స్థ‌లం 50వ రోజుకు కూడా మంచి షేర్ సాధించింది తెలుగు రాష్ట్రాల్లో.

ఖైదీ నంబ‌ర్ 150 పేరిట ఉన్న నాన్-బాహుబ‌లి షేర్ రికార్డును అల‌వోక‌గా దాటేసి కొత్త సినిమాలు అందుకోలేని టార్గెట్ సెట్ చేసింది. దీని త‌ర్వాత వ‌చ్చిన‌ భ‌ర‌త్ అనే నేను, అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్షి లాంటి హిట్ సినిమాలు రంగ‌స్థ‌లం రికార్డుకు చాలా దూరంలో ఆగిపోయాయి.

ఇప్ప‌డు సాహో లాంటి భారీ చిత్రం కూడా రంగ‌స్థ‌లం రికార్డును అందుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. వేర్వేరు భాష‌ల్లో రిలీజ్ చేయ‌డం వ‌ల్ల సాహో షేర్ ఇప్ప‌టికే రూ.180 కోట్ల దాకా చేరుకుంది. కానీ తెలుగు వ‌ర‌కు చూస్తే సాహో షేర్ రూ.80 కోట్ల లోపే ఉంది. రంగ‌స్థ‌లం సింగిల్ లాంగ్వేజ్‌లో రూ.128 కోట్ల షేర్ సాధించ‌డం విశేషం.

సాహోకు ఉన్న హైప్ దృష్ట్యా ఈ రికార్డును అల‌వోక‌గా దాటేస్తుంద‌నుకున్నారు. కానీ ఆ చిత్రం ఫుల్ ర‌న్లో రూ.100 కోట్ల షేర్ మార్కును అందుకోవ‌డం, ఖైదీ నంబ‌ర్ 150 షేర్‌ను దాట‌డం కూడా గ‌గ‌నంగా ఉంది. రంగ‌స్థ‌లం రికార్డు ద‌రిదాపుల్లోకి కూడా సాహో వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. త‌న రికార్డును దాటిన చ‌ర‌ణ్‌ను చిరునే సైరా న‌ర‌సింహారెడ్డితో దాటుతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English