‘వాల్మీకి’లో సుక్కుకేం పని?

‘వాల్మీకి’లో సుక్కుకేం పని?

నటన పట్ల ఆసక్తి ఉన్న దర్శకులు చాలా కొద్దిమందే ఉంటారు. సెట్లో నటీనటులకు ఎలా పెర్ఫామ్ చేయాలో చక్కగా చేసి చూపిస్తారు.. మంచి పనితనం రాబట్టుకుంటారు కానీ.. వాళ్లు మాత్రం ముఖానికి రంగేసుకోవడానికి.. కెమెరా వెనుక నుంచి ముందుకు రావడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లను కూడా ఒప్పించి మేకప్ వేయించేవాళ్లు కొందరుంటారు. హరీష్ శంకర్ అదే పని చేశాడు.

అగ్ర దర్శకుడు సుకుమార్‌ను తన ‘వాల్మీకి’ సినిమాలో చూపించబోతున్నాడు. ఆయనతో ఈ చిత్రంలో చిన్న వేషం చేయించేశాడు హరీష్. మామూలుగా సిగ్గరిగా కనిపించే సుక్కును నటనకు హరీష్ ఎలా ఒప్పించాడు.. సుక్కునే చేయాల్సిన పాత్ర ఇందులో ఏముంది అన్న సందేహాలు కలగడం సహజం. ఇక్కడే ఓ చమత్కారం దాగుంది. సుక్కు ‘వాల్మీకి’లో నిజ జీవిత పాత్రలోనే కనిపించబోతుండటం విశేషం.

‘వాల్మీకి’ రౌడీయిజంతో పాటు సినిమా నేపథ్యం కూడా ఉన్న సినిమా. ఇందులో హీరో సినీ రంగంలో దర్శకుడు కావాలన్న కలతో తిరుగుతుంటాడు. అతను చెప్పే కథల పట్ల నిర్మాతలు అంతగా ఆసక్తి చూపించరు. రౌడీయిజం చుట్టూ తిరిగే రియలిస్టిక్ స్టోరీ కావాలని అడిగితే.. ఒక క్రూరమైన రౌడీ గురించి తెలుసుకోవడానికి హీరో వెళ్తాడు. ఆ రౌడీనే వరుణ్ తేజ్ అన్నమాట. హీరో మొదట సినీ రంగంలో తిరిగేటపుడు కొందరు దర్శకులు, నిర్మాతల్ని చూపించాల్సి ఉంటుంది. అందులో సుకుమార్  ఒకడన్నమాట.

కొన్ని క్షణాలు లేదా నిమిషాలు మాత్రమే సుక్కు సినిమాలో కనిపించే అవకాశముంది. బహుశా సుక్కు దగ్గర హీరో అసిస్టెంటుగా పని చేస్తున్నట్లుగా చూపిస్తే చూపించొచ్చు. ఏదైతేనేం సుక్కు లాంటి అగ్ర దర్శకుడిని తన సినిమాలో నటింపజేసి హరీష్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English