కొర‌టాల - మెగాస్టార్ హీరోయిన్ ఫిక్స్‌...

కొర‌టాల - మెగాస్టార్ హీరోయిన్ ఫిక్స్‌...

చిరంజీవి అభిమానులంతా సైరా విడుదల రోజైన అక్టోబర్ 2వ తేదీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఖైదీ నెంబ‌ర్ 150 త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న చిరు సైరా న‌ర‌సింహారెడ్డి  అనే పీరియాడిక‌ల్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ న‌టిస్తోన్న ఈ సినిమా ఐదు భాష‌ల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. మరో వైపున చిరంజీవి తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. చిరు కోసం కొర‌టాల మంచి మెసేజ్ స‌బ్జెక్ట్ రెడీ చేసిన‌ట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ప‌లాస‌లో సెట్టింగ్స్ వేస్తున్నారు. తొలి షెడ్యూల్ అక్క‌డే జ‌ర‌గ‌నుంది. త్వరలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఆయన తన వైపు నుంచి అన్ని పనులను పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి బరువు తగ్గి, డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపించనున్నాడ‌ట‌. హాకీ కోచ్‌గా చిరు క‌నిపిస్తాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్‌. చిరు హాకీ కోచ్ అన‌గానే అంద‌రిలోనూ ఎక్క‌డా లేని ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా ముందు ఐశ్వర్య రాయ్ పేరు ప‌రిశీల‌ను వ‌చ్చింది. ఆమెను ఒప్పించేందుకు కొర‌టాల చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.

ఇక ఇప్పుడు కొర‌టాల ఇలియానాతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇలియానా చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో ర‌వితేజ - శ్రీను వైట్ల కాంబోలో వ‌చ్చిన అమర్ అక్బర్ ఆంటోని ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మ‌రి ఇప్పుడు నాజూకు ఇలియానా, చిరు జంట‌గా అంటే స్క్రీన్ మీద ర‌చ్చ మామూలుగా ఉండ‌దుగా..!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English