సమంతకి దండం పెట్టేస్తున్న నిర్మాతలు

సమంతకి దండం పెట్టేస్తున్న నిర్మాతలు

'ఓ బేబీ'తో సమంత చిత్రానికి ఇరవై కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ చేసే సత్తా వుందని తేలింది. ఇరవై కోట్లు థియేట్రికల్స్‌ అంటే మరో పది, పదిహేను కోట్లు ఇతరత్రా హక్కుల రూపంలో నిర్మాతల చేతికొస్తాయి. అంటే సమంత మార్కెట్‌ ముప్పయ్‌ అయిదు కోట్లన్నమాట. సమంతకి రెండు కోట్లు చెల్లించినా, మిగతా సినిమా పది, పన్నెండు కోట్లలో ఫినిష్‌ చేయవచ్చు.

అంటే సమంతతో సినిమా తీసి హిట్టు కొడితే నికరంగా ఇరవై కోట్ల లాభం చూడవచ్చు. ఈ కారణంగానే సమంతతో సినిమా తీద్దామని పలువురు నిర్మాతలు ఆమెని సంప్రదిస్తున్నారు. వీరిలో చిన్న, పెద్ద, సన్నకారు నిర్మాతలు చాలా మందే వున్నారు కానీ సమంత మాత్రం వారిలో ఎవరితోను పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. తనకిప్పుడు ఓ బేబీ, సూపర్‌ డీలక్స్‌ లాంటి కథలు కావాలని, ఆషామాషీ పాత్రలయితే తాను ఆల్రెడీ చాలానే చేసానని అంటోందట.

ఎవరు ఏ కథ చెప్పినా కానీ హీరోయిన్‌ పాత్రని అలా మార్చండి, ఇలాంటి వెరైటీ ఎలిమెంట్‌ ఏదైనా పెట్టండని డైరెక్ట్‌ చేస్తోందట. ఇక ఆమెతో సినిమా తీస్తే మానిటర్‌ దగ్గర కూర్చుని చూసుకోవడం మినహా డైరెక్ట్‌ చేసుకోవడం ఏమీ వుండదని దర్శకులు పలాయనం చిత్తగిస్తూ వుంటే, ఎంత మందిని పంపించి, ఎన్ని కథలు వినిపించినా రిజెక్ట్‌ చేస్తుండే సరికి సమంతని ఒప్పించడం బదులుగా నాలుగైదు సినిమాలు తీసుకుని అదృష్టం పరీక్షించుకోవచ్చు అని నిర్మాతలు దండం పెట్టేస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English