నా అవార్డులెందుకు తీసుకోరు.. సుబ్బిరామిరెడ్డి అసంతృప్తి

నా అవార్డులెందుకు తీసుకోరు.. సుబ్బిరామిరెడ్డి అసంతృప్తి

క‌ళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా వాళ్ల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం పెద్ద ఎత్తున అవార్డులు ప్ర‌క‌టిస్తుంటారు. అంగ‌రంగ వైభ‌వంగా వేడుక నిర్వ‌హించి అవార్డులు ప్ర‌దానం చేస్తుంటారు. ప్ర‌ధానంగా ఆయ‌న టార్గెట్ ఇండ‌స్ట్రీలోని పెద్ద కుటుంబాల మీదే ఉంటుంది. అంద‌రికీ క‌లిపి అవార్డులు పంచేస్తుంటారంటూ కొంద‌రు కామెడీలు కూడా చేస్తుంటారు.

కానీ సుబ్బిరామిరెడ్డి అదేమీ ప‌ట్టించుకోకుండా అవార్డుల వేడుక నిర్వ‌హిస్తుంటారు. ఐతే తాను ప్ర‌క‌టించే అవార్డుల్ని ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖ హీరోలు తీసుకోక‌పోవ‌డం ప‌ట్ల ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఎప్ప‌ట్లాగే ఈ ఏడాది కూడా సెప్టెంబ‌రు 17న విశాఖ‌ప‌ట్నంలో టీఎస్సార్ అవార్డుల వేడుక ఘ‌నంగా చేయ‌డానికి సుబ్బిరామిరెడ్డి రెడీ అయ్యారు.

కానీ ఈసారైనా ఈ అవార్డులు తీసుకోవ‌డానికి సెల‌బ్రెటీలు వ‌స్తారో రారో అన్న అనుమానంతో ఈ విష‌యంలో త‌న అసంతృప్తిని బ‌య‌ట‌పెట్టారు సుబ్బిరామిరెడ్డి. ఒక‌ప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎంత పెద్ద స్టార్ల‌యిన‌ప్ప‌టికీ.. త‌మకు ఎవ‌రు అవార్డు ప్ర‌క‌టించినా స్వ‌యంగా హాజ‌రై వాటిని స్వీక‌రించేవార‌ని సుబ్బిరామ‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్ప‌టి హీరోలు మాత్రం వాళ్ల‌ను ఫాలో కావ‌డం లేద‌ని అన్నారు.

ఈసారి వేడుక‌ల్లో జ‌య‌సుధ‌కు అభిన‌య మ‌యూరి అనే అవార్డు ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ నిర్వ‌హించిన ప్రెస్ మీట్లో జ‌య‌సుధ కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు రెండూ నంది అవార్డుల్ని ప‌క్క‌న పెట్టేయ‌డం బాధాక‌ర‌మ‌ని.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం క‌ళైమామ‌ణి అవార్డుల్ని చాలా గొప్ప‌గా నిర్వ‌హిస్తోంద‌ని.. కానీ మ‌న ప్ర‌భుత్వాలు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నంది పుర‌స్కారాల వేడుక‌ను ఎందుకు నిర్వ‌హించ‌ట్లేదో అర్థం కావ‌డం లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English