పవన్ మీద ఎందుకింత విష ప్రచారం?

పవన్ మీద ఎందుకింత విష ప్రచారం?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్ కాదు. ఆయన జనసేనాని. ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ స్పష్టం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆయన్ని ‘పవర్ స్టార్’ను చేయడానికి ప్రత్యర్థులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లకముందే.. ఫలితాలు ఎలా ఉన్నా పవన్ సినిమాల్లోకి పునరాగమనం చేయడం ఖాయమంటూ గత ఏడాది ప్రచారం సాగించారు. ఇక ఎన్నికల్లో జనసేనకు ఘోర పరాభవం ఎదురయ్యాక ఆగుతారా? సినిమాల్లోకి ఇదిగో వచ్చేస్తున్నాడు.. అదిగో వచ్చేస్తున్నాడు అంటూ ఊదరగొట్టారు.

ఆయన సినిమాల్లోకి వస్తే తప్పేంటి అంటూ మద్దతుదారులు కూడా కొందరు మాట్లాడటంతో పవన్ నిజంగానే సినిమాల్లోకి వచ్చేస్తాడేమో అని కూడా అనుకున్నారు. నిజానికి పవన్ సినిమాల్లోకి తిరిగొస్తే తప్పేమీ లేదు. ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ చక్కగా మాస్ మసాలా సినిమాలు చేస్తున్నపుడు పవన్‌‌ రీఎంట్రీ ఇస్తే తప్పేముంది?

అయినా కూడా పవన్ మాత్రం ఆ దిశగా ఆలోచించట్లేదు. సినిమాల్లోకి తిరిగి రాననే మాటకు కట్టుబడి ఉన్నాడు. ఎవరెంత బలవంతం చేస్తున్నా.. పార్టీని నడిపే విషయంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ సినిమాలు చేయకూడదని.. గత ఎన్నికలకు ముందు చేసిన తప్పుల్ని దిద్దుకుని ఈ పర్యాయం పూర్తిగా జనాల్లోనే ఉండి పార్టీని బలపరచాలాని చూస్తున్నాడు. కానీ ప్రత్యర్థులు ఊరుకుంటారా? పవన్ ఎక్కడ బలపడిపోతాడో.. జనాల మనసులు గెలిచేస్తాడో అని దుష్ప్రచారాలకు దిగుతున్నట్లే ఉంది.

తాను మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్లుగా పవన్ కళ్యాణే ఒక లెటర్ మీడియాకు విడుదల చేసినట్లుగా సెటప్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పవన్ నుంచే ప్రకటన రావడంతో ఇక సినిమా చేయడం ఖాయమన్న అభిప్రాయాలకు చాలామంది వచ్చేశారు. కానీ ఇది నిజం కాదని.. తర్వాత జనసేన నుంచి ప్రకటన వచ్చింది. పవన్ గురించి ఈ విష ప్రచారాన్ని బట్టి ప్రత్యర్థులు ఆయన్ని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English