పవన్ హీరోయిన్ ఎంత పెద్ద తప్పు చేసిందంటే..

పవన్ హీరోయిన్ ఎంత పెద్ద తప్పు చేసిందంటే..

అక్షరం బలి కోరుకుంటుందంటూ చెప్పేటోళ్లు పెద్దోళ్లు. ఇప్పుడా తరం చాలా తక్కువమందే కనిపిస్తారు. కానీ.. వారి మాట మాత్రం అక్షర సత్యమన్నది.. తాజా డిజిటల్ యుగంలో ప్రతిసారి అనుభవంలోకి వస్తున్న పరిస్థితి. నోటి నుంచి వచ్చే మాటకు మించిన రచ్చ రాసిన అక్షరంతో ఉంటోంది.

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పోషిస్తున్న కీ రోల్ గురించి తెలిసిందే. తొందరపాటు కానీ.. అవగాహన లేమితో చేసే తప్పులకు భారీగా మూల్యం చెల్లించాల్సిందే. ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తుంది పవన్ హీరోయిన్ నికిషా పటేల్. ఆమె చేసిన తప్పునకు వెంటనే రియాక్ట్ కావటమే కాదు.. తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసి పీకే ఫ్యాన్స్ ఆగ్రహాజ్వాలల నుంచి తప్పించుకుంది.

సెప్టెంబరు 2 అన్నంతనే తెలుగు సినీ ప్రేమికులకు గుర్తుకు వచ్చేది పవన్ కల్యాణ్ బర్త్ డే. మామూలుగానే పవన్ పుట్టిన రోజు అంటే ఆయన అభిమానులకు పండగ. ఈఏడాది వినాయకచవితి కూడా అదే రోజు రావటంతో ఆ సంతోషం డబుల్ అయ్యింది. పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులతో.. ట్వీట్లతో మోతెక్కించేశారు పీకే ఫ్యాన్స్.

ఈ విషెస్ పుణ్యమా అని.. సోమవారం ట్విట్టర్ ఇండియాలో టాప్ వన్ ట్రెండింగ్ అయ్యారు పవన్. మిలియన్ల కొద్దీ ట్వీట్ విషెస్ చెప్పి తమ అభిమానాన్ని ప్రదర్శించారు పవన్ అభిమానులు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. హీరోలు.. హీరోయిన్లు.. దర్శకులు.. నిర్మాతలు..ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా పవన్ పట్ల తమకున్న అభిమానాన్ని బర్త్ డే విషెస్ రూపంలో ప్రదర్శించారు.

ఈ హడావుడిలోనే పవన్ నటించిన కొమరం పులి చిత్రంలో  హీరోయిన్ గా నటించిన నికిషా పటేల్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. సెప్టెంబరు 2.. పవన్ బర్త్ డే తో పాటు కన్నడ స్టార్ నటుడు సుదీప్ జన్మదినోత్సవం కూడా. ఈ విషయాన్ని చెబుతూ ఆమె బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక్కడితో ఆగితే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. తన పోస్ట్ కు.. పవన్ పేరుతో ట్రెండ్ అవుతున్న కొన్ని హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది. ఆమె పేర్కొన్న హ్యాష్ టాగ్ లలో..
#HappyBirthdayPawalaKalyan
#HappyBirthdayPawanaKalyanfromSSMBfans
#HappyBirthdayPawalaKalyan
#HappyBirthdayPSPK
#pawankalyan ఉన్నవాటిల్లో పొరపాటున పావలా పవన్ కల్యాణ్ అని ఉన్న హ్యాష్ టాగ్ కు కూడా తన ట్వీట్ కు జత చేసింది. పావలా కల్యాణ్ అంటూ ఈ మధ్య పీకే మీద సెటైర్లు వేస్తూ.. ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న హ్యాష్ టాగ్ ను జత చేయటంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. చేసిన తప్పును గుర్తించిన నికిషా వెంటనే రియాక్ట్ అయి.. తాను చేసిన ట్వీట్ ను డిలీట్ చేశారు. వేరే ట్వీట్లలో తాను చేసిన తప్పునకు సారీ చెప్పారు.

ఎవరైనా హర్ట్ అయితే సారీ.. తప్పును సరిదిద్దుకున్నా.. హ్యాపీ గణేశా అంటూ మరో ట్వీట్ చేశారు. ఈసారీ రెండు హ్యాష్ టాగ్ లను జత చేసింది. తానీసారి సరిగానే ట్యాగ్ చేశానని అనుకుంటున్నట్లుగా చెప్పిన ఆమె.. సోషల్ మీడియా క్లిష్టంగా మారిందని.. దీన్ని ఎలా కొనసాగిస్తున్నారో తెలీదని పేర్కొంది. చేసింది తప్పు అయినప్పుడు.. అభిమానులు ఆ మాత్రం రియాక్ట్ కాకుండా ఉంటారా? అసలు.. తాను చేసిన ట్వీట్ వైరల్ అవ్వాలి.. అందరి కంట్లో పడాలన్న తపన లేకుంటే ఈ తిప్పలే ఉండేవి కాదు కదా?  మన కోరికే మనల్ని ఇబ్బంది పడుతుందన్న మాట నికీషా లాంటోళ్లకు ఎప్పుడు అర్థమవుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English