సైరాకి సాహో దెబ్బ!

సైరాకి సాహో దెబ్బ!

ట్రేడ్‌ సర్కిల్స్‌ ముందుగానే ఊహించినట్టుగా సాహో బాక్సాఫీస్‌ పర్‌ఫార్మెన్స్‌ సైరా బిజినెస్‌ని ఎఫెక్ట్‌ చేస్తోంది. సాహో అంచనాలని అందుకున్నట్టయితే సైరాకి బెనిఫిట్‌ అయ్యేది. ప్రతి చోటా ఎగ్జిబిటర్లు, థర్డ్‌ పార్టీల వాళ్లు మరింత ఎక్కువ ఆఫర్లతో ముందుకి వచ్చేవారు. కానీ సాహోకి వచ్చిన టాక్‌తో ఇప్పుడా పరిస్థితి లేదు.

తొలి వారాంతంలో వసూళ్లు బాగానే వచ్చినా కానీ బ్రేక్‌ ఈవెన్‌ కష్టమనేది అంతా ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే తరహా భారీ చిత్రమయిన సైరా మాత్రం ఎందుకు గాడి తప్పకూడదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాహోకి ఆంధ్రప్రదేశ్‌లో వస్తోన్న స్పందన వల్ల సైరా బిజినెస్‌పై ప్రభావం తీవ్రంగా వుంటుంది.

సాహో మీద బెట్‌ కట్టినట్టుగా దీనిపై బ్లయిండ్‌గా బెట్‌ వేయడానికి ఎవరూ సిద్ధంగా లేరని ట్రేడ్‌ చెబుతోంది. ఆల్రెడీ ఓవర్సీస్‌ రేట్‌ పరంగా సైరాపై బేరసారాలు మొదలయ్యాయి. పదిహేను కోట్ల వరకు ఇస్తామన్నవాళ్లు ఇప్పుడు దానికి కూడా ఆలోచిస్తున్నారు.

రామ్‌ చరణ్‌ అయితే ఇరవై నుంచి పాతిక కోట్లయినా ఓవర్సీస్‌ నుంచి వస్తాయని ఆశిస్తున్నాడు. కానీ సాహో అంచనాలని అందుకోలేకపోవడంతో సైరాపై ఆ స్థాయిలో రిస్కు చేయడానికి ఎవరూ ముందుకి రావట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English