సమంత ఎట్టా సూట్‌ అవుతుందండీ?

సమంత ఎట్టా సూట్‌ అవుతుందండీ?

సినిమా తారల బయోపిక్స్‌లో ప్రధాన పాత్ర పోషించే వారికి ఎలాంటి హైట్‌, వెయిట్‌ వున్నా అడ్జస్ట్‌ అవ్వవచ్చు కానీ స్పోర్ట్స్‌ పర్సన్స్‌ బయోపిక్స్‌కి మాత్రం సదరు వ్యక్తికి తగ్గట్టు ఈ నటి లేదా నటుడు తప్పక వుండి తీరాలి. క్రీడాకారులు ఫలానా స్పోర్ట్‌లో రాణించడానికి చాలాసార్లు తమ హైట్‌, వెయిట్‌ ప్లస్‌ అవుతుంటాయి.

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పి.వి. సింధునే తీసుకుంటే ఆమె చాలా పొడగరి. ఆ హైట్‌ వలనే ఆమె విదేశీ క్రీడాకారిణులకి పోటీ ఇవ్వగలుగుతోంది. ఆమె జీవిత కథని సినిమాగా తీయాలనుకుంటే తప్పకుండా తన ఫిజిక్‌కి తగ్గ హీరోయిన్‌ని ఎంచుకుని తీరాలి. అయితే చిత్రంగా ఆమె బయోపిక్‌ని సమంతతో తీస్తున్నారనే ప్రచారం మొదలయింది.

సమంతది యావరేజ్‌ హైట్‌. ఖచ్చితంగా సింధు పాత్రకి ఆమె సరిపోదు. ఇటీవల సమంత ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ వుండడంతో ఆమె ఏదో స్పోర్ట్స్‌ సినిమా కోసమే ఇలా రెడీ అవుతోందనే ఫీలింగ్‌తో పి.వి. సింధు కథ అనే పుకారు పుట్టింది. సమంత తనని ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదని, ఆ చిత్రం చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

అయితే ఓ బేబీ సక్సెస్‌ తర్వాత మాత్రం సమంత కోసం క్యూ కడుతోన్న వారి సంఖ్య పెరిగింది. కానీ ఆమె మాత్రం అంత మంచి కథ అయితేనే సోలోగా నటిస్తానని చెప్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English