'సాహో' హనీమూన్‌ ముగిసింది!

'సాహో' హనీమూన్‌ ముగిసింది!

సాహో హిందీ వెర్షన్‌ పర్‌ఫార్మెన్స్‌ ట్రేడ్‌ వర్గాలని విస్మయ పరచింది. బాహుబలి హీరో తదుపరి చిత్రమనే క్రేజ్‌ వున్నప్పటికీ తొలి రోజు వచ్చిన డిజాస్టర్‌ టాక్‌కి, అక్కడి ప్రముఖ విమర్శకులు ఇచ్చిన రేటింగులకి సాహో ఫస్ట్‌ వీకెండ్‌లోను నిలబడదని అనుకున్నారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఫస్ట్‌ వీకెండ్‌లో ఇండియాలో 93 కోట్ల నెట్‌ వసూళ్లని సాధించింది. నేటితో వంద కోట్ల నెట్‌ వసూళ్ల మార్కుని దాటనుంది.

అయితే సోమవారంతో హనీమూన్‌ పీరియడ్‌ ముగిసినట్టే అనుకోవాలి. ఇక్కడ్నుంచి సాహో ముందుకి సాగడానికి ఇబ్బంది పడుతుంది. అయితే నూట యాభై కోట్ల నెట్‌ వసూళ్లు సాధిస్తుందా లేక 2.0ని కూడా దాటుతుందా అనేది ఇక నుంచి వచ్చే వసూళ్లపై ఆధారపడుతుంది. సోమవారం సెలవు అయినా కానీ వసూళ్లలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

ఆదివారం నుంచి సోమవారానికి ఫిఫ్టీ పర్సెంట్‌ పైగా ఫాల్‌ వుండడంతో వర్కింగ్‌ డేస్‌లో అనుకున్నంత రాదనే భావన కలుగుతోంది. పైగా వచ్చే వారం సుషాంత్‌ సింగ్‌ నటించిన 'చిచోరే' చిత్రం విడుదల కానుంది. దానిపై క్రేజ్‌ చాలా వుంది కనుక సాహోకి మల్టీప్లెక్సులతో పాటు ఓవర్సీస్‌లోను హర్డిల్‌ ఎదురవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English