విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌కి సుడి తిరిగింది

 విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌కి సుడి తిరిగింది

అర్జున్‌రెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్‌లో నటించినా కానీ షాలిని పాండేకి తగినన్ని అవకాశాలు రాలేదు. అయినా కానీ డీలా పడకుండా తన శరీరాకృతిపై దృష్టి పెట్టిన షాలిని సరాసరి బాలీవుడ్‌ వాళ్ల కంట్లోనే పడింది. ఆమెకి ఏకంగా యష్‌రాజ్‌ సంస్థతో మూడు సినిమాలు చేసే డీల్‌ కుదిరింది. యష్‌రాజ్‌ బ్యానర్లోకి ఒక్కసారి వెళ్లడమంటే లైఫ్‌ సెటిల్‌ అయినట్టే అని బాలీవుడ్‌లో చెబుతుంటారు.

షాలినికి పారితోషికం పరంగా ఈ మూడు సినిమాలకీ ఎక్కువ గిట్టుబాటు కాకపోవచ్చు కానీ ఈ మూడు సినిమాల్లో రెండు లేదా ఒకటి హిట్టయినా కానీ ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చి పడతాయి. పైగా యష్‌రాజ్‌ తీసేవన్నీ భారీ సినిమాలే కావడం వల్ల ఎక్స్‌పోజర్‌ కూడా బాగా దక్కుతుంది. తెలుగునాట క్లిక్‌ అవలేకపోయిన షాలినికి సుడి తిరిగి బాలీవుడ్‌లోనే మల్టిపుల్‌ సినిమాల డీల్‌ కుదరడంతో ఇతర హీరోయిన్లకి కన్ను కుడుతోంది.

విజయ్‌ దేవరకొండ కూడా ఇంకా బాలీవుడ్‌కి వెళ్లలేదు కానీ అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌గా షాలినికి ప్రమోషన్‌ దక్కింది. అర్జున్‌రెడ్డి సినిమా నార్త్‌లోను పాపులరే కనుక షాలిని అక్కడ మరీ జీరోతో మొదలు పెట్టాల్సిన అవసరమే లేదు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English