సాహో అక్కడ డిజాస్టర్‌!

 సాహో అక్కడ డిజాస్టర్‌!

హిందీలో భారీ చిత్రాలకి తీసిపోని వసూళ్లని సాధిస్తూ, నైజాంలో కూడా రికార్డులు నెలకొల్పుతోన్న సాహో తమిళనాట మాత్రం బాహుబలి మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోయింది. బాహుబలితో హిందీ మార్కెట్లలో ప్రభాస్‌కి వచ్చిన క్రేజ్‌ తమిళనాట అయితే క్లియర్‌గా రాలేదు.

సాహోకి బ్యాడ్‌ టాక్‌ రావడంతో తమిళ వెర్షన్‌ నీరసంగా ముందుకి కదులుతోంది. తమిళంలో ఈ చిత్రానికి కనీసం అరవై శాతం నష్టాలు ఖాయమని అక్కడి ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. హిందీ వెర్షన్‌కి వస్తోన్న వసూళ్లని చూసి ప్రభాస్‌ని పాన్‌ ఇండియా సూపర్‌స్టార్‌ అంటూ అంతా కొనియాడుతున్నారు. అయితే బాహుబలి ఇమేజ్‌ని తమిళనాట క్యారీ ఫార్వర్డ్‌ చేయడంలో ప్రభాస్‌ విఫలమయ్యాడు.

సాహో విడుదలకి ముందు, అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోను తమిళనాట సందడి కనిపించలేదు. ఇక సినిమాకి ఫ్లాప్‌ టాక్‌ రావడంతో తమిళ జనం అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ చిత్రం కోసం సూర్య చిత్రాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం. అలాగే కేరళలో కూడా సాహో ప్రభావం అస్సలు కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాలు, నార్త్‌ ఇండియాతో పాటు కర్నాటకలో ప్రభాస్‌ జెండా పాతేసినా కానీ దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కేరళ మాత్రం అతడి సినిమాల కంటెంట్‌కి అనుగుణంగానే స్పందిస్తాయనేది స్పష్టమయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English