ఇట్స్‌ అఫీషియల్‌.. అమెరికా మార్కెట్‌ కొలాప్స్‌!

ఇట్స్‌ అఫీషియల్‌.. అమెరికా మార్కెట్‌ కొలాప్స్‌!

రెండు, మూడేళ్ల క్రితం మూవీ పాస్‌ అని, ఇతర ఫ్రీ టికెట్లనీ ఆఫర్లు వుంటే తెలుగు జనం ఎగబడి థియేటర్లకి వచ్చేసేవాళ్లు. ఎలాంటి సినిమాకైనా వసూళ్లు వచ్చేస్తుండేవి. సాధారణ టాక్‌ వచ్చిన సినిమాలకి కూడా పొలోమని థియేటర్లపై పడేవాళ్లు. కానీ ఈ ఏడాది ఆరంభం నుంచి కూడా యుఎస్‌ మార్కెట్‌లో క్షీణత కనిపిస్తూనే వచ్చింది. బాగున్న సినిమాలకి, రేటింగులు వచ్చిన చిత్రాలకీ కూడా గతంతో పోలిస్తే వీక్‌ వసూళ్లు వచ్చాయి.

యుఎస్‌ మార్కెట్‌ ఎంతగా పడిపోయిందనేది ఇప్పుడు సాహో వసూళ్లు చూస్తే తెలుస్తోంది. ప్రీమియర్లతో మిలియన్‌ డాలర్లు తెచ్చుకోవడం సాధ్యపడలేదు. ఆ తర్వాత కూడా హిందీ వెర్షన్‌ వల్ల స్టడీ కలక్షన్లు కనిపిస్తున్నాయి కానీ ఒక్క తెలుగు వెర్షన్‌ని మాత్రమే చూస్తే ఆ లోటు మరీ తీవ్రంగా కనిపించేది. సాహోతో సినిమా క్లియర్‌ అయిపోవడంతో ఇకపై పెద్ద సినిమాలకి భారీ అమౌంట్లు ఆఫర్‌ చేయడానికి అక్కడి బయ్యర్లు సిద్ధ పడడం లేదు. సదరు హీరో గత చిత్రం ఎంత వసూలు చేసిందనే దానికి అనుగుణంగా రీ అనలైజ్‌ చేసుకుని రేట్లు డిసైడ్‌ అవుతున్నారు.

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఇకపై భారీ చిత్రాలకి టూ మిలియన్‌ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ అనుకోవచ్చు. ఒక మాదిరి సినిమాలకి మిలియన్‌ లేదా 1.2 మిలియన్‌గా చూడవచ్చు. చిన్న సినిమాలకి అయితే రెండు కోట్లకి మించి రేటు పలికే అవకాశమే లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English