ప్రభాస్‌కి పెళ్లి చూపుల‌య్యాయా?!

 ప్రభాస్‌కి పెళ్లి చూపుల‌య్యాయా?!

వ‌చ్చే యేడాది పెళ్లి పీట‌లెక్కబోతున్నాడు ప్రభాస్‌. మ‌ధ్యలో 'బాహుబ‌లి' సినిమా అడ్డొచ్చింది కానీ... లేదంటే మాత్రం ఈ యేడాదే క‌ల్యాణం దిద్దుకొనేవాడు యంగ్ రెబ‌ల్‌స్టార్‌. 'బాహుబ‌లి'కోసం రెండేళ్లు పూర్తిస్థాయిలో స‌మ‌యం కేటాయించాల్సి ఉంటుందని జ‌క్కన్న చెప్పడంతో ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఆగిపోయాడు.

2015లో  ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఎలాగో ఈ యేడాది ఆగ‌స్టు, సెప్టెంబ‌రులోపు 'బాహుబ‌లి' సినిమా పూర్తవుతుంది కాబ‌ట్టి... ఇంట్లోవాళ్లు ప్రభాస్‌కి పెళ్లి సంబంధాల‌ను చూడ‌టం మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది. భీమ‌వ‌రంలో ఓ అమ్మాయిని చూశార‌ట‌. కుటుంబ స‌భ్యులంద‌రికీ ఆ అమ్మాయి బాగా న‌చ్చేసింద‌ట‌. ఇప్పుడు ప్రభాస్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడ‌మే ఆల‌స్యమ‌ని స‌మాచారం. ఆ సంబంధం ఓకే అయ్యిందంటే మాత్రం... ప్రభాస్ పెళ్లి వ‌చ్చే ఫిబ్రవ‌రిలో జ‌రపాల‌ని కుటుంబ స‌భ్యులు నిర్ణయించుకొన్నార‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు