మ‌హేష్‌.. చ‌ర‌ణ్‌.. ఇక విజ‌య్?

మ‌హేష్‌.. చ‌ర‌ణ్‌.. ఇక విజ‌య్?

కియారా అద్వానీ కెరీర్ ఆరంభంలో హిందీలో అంత పెద్ద సినిమాలేమీ చేయ‌లేదు. ఎం.ఎస్‌.ధోనిలో చేసిన చిన్న పాత్ర‌తో కొంచెం గుర్తింపు సంపాదించింది. ఆ త‌ర్వాత ల‌స్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో న‌టించి పాపుల‌రైంది. కానీ ద‌క్షిణాదిన మాత్రం కియారాకు భ‌లే ఎంట్రీ ద‌క్కింది. ఏకంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న త‌న తొలి సినిమా చేసింది.

భ‌ర‌త్ అనే నేను హిట్ట‌వ‌డంతో వెంట‌నే రామ్ చ‌ర‌ణ్ లాంటి మ‌రో పెద్ద హీరో స‌ర‌స‌న విన‌య విధేయ రామ సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా కియారా కెరీర్‌కేమీ ఢోకా లేదు. హిందీలో ఆమె న‌టించిన‌ క‌బీర్ సింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయి కెరీర్‌కు మ‌రింత ఊపు తెచ్చింది. ఇప్పుడు హిందీలో ల‌క్ష్మీబాంబ్ స‌హా రెండు మూడు భారీ చిత్రాల్లో ఆమె న‌టిస్తోంది.

ఇప్పుడు కియారాకు ద‌క్షిణాదిన మ‌రో భారీ చిత్రంలో అవ‌కాశం ద‌క్కిన‌ట్లు స‌మాచారం. త‌మిళంలో ఇప్పుడు బిగ్టెస్ట్ స్టార్ అన‌ద‌గ్గ విజ‌య్ స‌ర‌స‌న కియారా న‌టించ‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో బిగిల్ అనే సినిమా చేస్తున్న విజ‌య్.. దీని త‌ర్వాత మాన‌గ‌రం (తెలుగులో న‌గ‌రం) అనే చిన్న సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన లోకేష్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్లో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు.

 ఈ చిత్రంలో కియారానే క‌థానాయిక‌గా ఎంచుకున్న‌ట్లు స‌మాచారం. విజ‌య్ సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మంటే చిన్న విష‌యం కాదు. ఈ సినిమా స‌క్సెస్ అయితే కియారాకు త‌మిళంలో తిరుగుండ‌దు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. ఈ ఏడాది చివ‌ర్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌నుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English