చై-సామ్ వీడియో వైర‌ల్‌

 చై-సామ్ వీడియో వైర‌ల్‌

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ సెల‌బ్రెటీ క‌పుల్స్‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంతల జోడీ ముందు వ‌రుస‌లో ఉంటుంది. వీరిలో చైతూ ఇంట్రావ‌ర్ట్. చాలా కామ్‌గా క‌నిపిస్తాడు. హ‌డావుడి ఉండ‌దు. స‌మంత అత‌డికి పూర్తి భిన్నం. ఎప్పుడూ గ‌ల‌గ‌లా మాట్లాడుతుంటుంది. సంద‌డి చేస్తుంటుంది. ఐతే భిన్న‌ధ్రువాల్లా క‌నిపించే ఈ ఇద్ద‌రి మ‌ధ్య గొప్ప స‌మ‌న్వ‌యం క‌నిపిస్తుంటుంది.

ఇద్ద‌రూ క‌లిసి వ్య‌క్తిగ‌త‌ జీవితాన్ని ఆస్వాదించే తీరు ముచ్చ‌ట‌గొలుపుతుంది. పెళ్లి త‌ర్వాత త‌ర‌చుగా టూర్ల‌కు వెళ్తున్న ఈ జోడీ.. వెకేష‌న్ విశేషాల్ని ఫొటోలు, వీడియోల ద్వారా పంచుకుంటూ ఉంటుంది.

నాగార్జున పుట్టిన రోజు వేడుక‌ల కోసం ఫారిన్ ట్రిప్ వేసిన ఈ జోడీ అక్క‌డ బాగానే ఎంజాయ్ చేస్తున్న సంగ‌తి ఇప్ప‌టికే కొన్ని ఫొటోల్లో స్ప‌ష్ట‌మైంది. తాజాగా వీళ్లిద్ద‌రి వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో ఏ దేశంలో ఏ ప్రాంతంలో తీసింద‌న్న‌ది తెలియ‌డం లేదు కానీ.. ఒక మ్యూజిక‌ల్ క‌న్స‌ర్ట్ జ‌రుగుతున్న చోట బాల్క‌నీలో నిల‌బ‌డి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు చై-సామ్.

స‌మంత పాట హ‌మ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటే.. చైతూ చేతిలో డ్రింక్ పెట్టుకుని సైతం పాదం క‌దుపుతూ హ‌మ్ చేస్తూ క‌నిపించాడు. చాలా క్యూట్‌గా క‌నిపిస్తున్న ఈ వీడియో కాసేప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English