అందనంత ఎత్తులో ప్రభాస్‌

అందనంత ఎత్తులో ప్రభాస్‌

పాన్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రభాస్‌ ఎదిగిపోయాడనడంలో సందేహం లేదు. ఈ ఏడాదిలో నాన్‌ హాలిడే రిలీజ్‌లలో అత్యధిక ఓపెనింగ్‌ సాహోకే వచ్చింది. హిందీ టాప్‌ స్టార్ల వల్ల కూడా కాని దానిని ప్రభాస్‌ చేతి చూపించాడు. అది కూడా తొలి రోజున హిందీ బెల్ట్‌లో చాలా షోస్‌ రద్దయ్యాయి. అయినా కానీ రికార్డ్‌ కలక్షన్లు అంటే ఇక హాలిడే రిలీజ్‌ అయితే పరిస్థితి ఎలా వుండేదో మరి.

ఇక తెలుగు రాష్ట్రాలకి వస్తే ప్రభాస్‌ మిగతా హీరోలు ఎవరికీ అందనంత ఎత్తులో వున్నాడనేది సాహో ఓపెనింగ్‌ నిరూపించింది. బాహుబలి 2 వసూళ్లు రాజమౌళి అకౌంట్‌లో వేసేస్తారు కానీ అసలు పేరు కూడా తెలియని దర్శకుడితో ప్రభాస్‌ ఈసారి తన సత్తా ఏమిటో చూపించాడు. ఓపెనింగ్‌ పరంగా ఈ ఘనత మళ్లీ ఏ హీరోకి అయినా ఇప్పట్లో దక్కుతుందా అనే విధంగా అదరగొట్టాడు. ఇండియాలో వంద కోట్లకి పైగా గ్రాస్‌ తొలి రోజు వసూలు చేసిన సినిమాలు రెండయితే ఆ రెండిట్లోను హీరో ప్రభాసే.

హిందీ వెర్షన్‌కి రెండవ రోజు వసూళ్లు బీభత్సంగా వున్నాయంటే దానికి కారణం అతనొక్కడే. ఖచ్చితంగా ఈ చిత్రం చూడాలని నార్త్‌ ఆడియన్స్‌ ఫిక్స్‌ అయిపోవడం వల్లనే ఈ వసూళ్లు వస్తున్నాయి. బాహుబలికి ముందు ప్రభాస్‌ కనీసం నంబర్‌వన్‌ రేసులో కూడా వుండేవాడు కాదు. కానీ ఇప్పుడు తన స్థానం దక్కించుకోవడంలో మిగతా హీరోలు కనుచూపు మేరలోను లేరు. సరయిన ప్లానింగ్‌తో ప్రభాస్‌ ఈ పాన్‌ ఇండియా ఇమేజ్‌తో అద్భుతాలు చేయవచ్చునని ఉత్తరాది ట్రేడ్‌ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English