రాజ్‌ తరుణ్‌ కొంప ముంచిన వీడియో!

రాజ్‌ తరుణ్‌ కొంప ముంచిన వీడియో!

వరుస విజయాలతో దూసుకుపోతున్న టైమ్‌లో చాలా మంది యువ హీరోలలానే స్క్రిప్టు జడ్జిమెంట్‌లో దెబ్బ తిని ఫ్లాప్‌ హీరో ముద్ర వేయించుకున్నాడు రాజ్‌ తరుణ్‌. ఒక టైమ్‌లో తన కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. అలాంటిది ఇప్పుడు తనకి అవకాశాలు ఇచ్చే వారే లేరు. ఇలాంటి టైమ్‌లో అతనికి దిల్‌ రాజు బ్యానర్‌లో సినిమా సెట్‌ చేయించాడు రాజా రవీంద్ర.

పారితోషికం లేకుండా బ్రేక్‌ కోసమే ఈ చిత్రం చేస్తోన్న రాజ్‌ తరుణ్‌ త్వరలోనే ఆ చిత్రం విడుదల కానుంది అనుకునేలోగా ఒక రాంగ్‌ న్యూస్‌తో బయటకి వచ్చాడు. చాలా కాలం పాటు అతనేమి చేస్తున్నాడనేది కూడా ఎవరికీ తెలియదు. ఏదైనా కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌తో బయటకి వస్తే బాగుండేది. కానీ తాగి కారు నడుపుతూ అదుపు తప్పి డివైడర్‌ని గుద్దిన వీడియోతో వార్తల్లోకి వచ్చాడు.

దానిని చాలా బ్యాడ్‌గా హ్యాండిల్‌ చేసి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కి గురయ్యాడు. దీంతో అతను చేస్తోన్న సినిమాని ఆలస్యంగా విడుదల చేయాలని దిల్‌ రాజు నిర్ణయించుకున్నాడట. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్‌ బయటకి వచ్చినా నెగెటివ్‌ అవుతుందని, అంచేత జనం ఈ న్యూస్‌ మరచిపోయే వరకు సినిమా అప్‌డేట్స్‌ ఏమీ ఇవ్వవద్దని టీమ్‌కి చెప్పేసాడట. అలాగే రాజ్‌ తరుణ్‌ని కూడా కొంతకాలం పాటు మీడియా కంట పడకుండా వుండాలని చెప్పాడట. రాంగ్‌ టైమ్‌ నడుస్తున్నపుడు తాడే పాము అవుద్ది అన్నట్టు... కారు స్టీరింగ్‌ కూడా మాట వినక వార్తల్లో నిలబెడుతుంది. పాపం రాజ్‌ తరుణ్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English