ఆ నిర్మాతకే అంకితమైపోయిన హీరోయిన్‌

ఆ నిర్మాతకే అంకితమైపోయిన హీరోయిన్‌

వాణీ కపూర్‌ బాలీవుడ్‌కి పరిచయమై ఏడేళ్లవుతోంది. ఇంతవరకు ఆమె నాలుగు సినిమాలు చేస్తే అవన్నీ ఆదిత్య చోప్రా నిర్మాణంలోనే చేసింది. తెలుగులో ఆహా కళ్యాణం కూడా యష్‌రాజ్‌ సంస్థే నిర్మించింది. ఆమె గత చిత్రం బేఫిక్రే మూడేళ్ల క్రితం రిలీజ్‌ అయితే ఈ మూడేళ్లలో ఆమె వేరే సినిమా ఏదీ చేయలేదు. యష్‌రాజ్‌ సంస్థ నిర్మించిన 'వార్‌'లో మాత్రమే ఆమె నటించింది. ఇది కాకుండా ఆమె చేస్తోన్న మరో చిత్రం 'సంషేరా'. దీనికి కూడా నిర్మాత ఆదిత్య చోప్రా అని చెప్పాల్సిన పని లేదు.

'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌'తో పరిచయం అయినపుడు వాణి కపూర్‌ ఆ సంస్థకి మూడు సినిమాల కాంట్రాక్ట్‌ సైన్‌ చేసింది. అది బేఫిక్రేతో ముగియగా, ఆమె తదుపరి రెండు చిత్రాలు కూడా అదే బ్యానర్‌లో చేస్తోంది. 'వార్‌' చిత్రంలో బికినీ విందు చేస్తూ కుర్రకారుని ఉర్రూతలూగిస్తోన్న ఈ పొడుగు కాళ్ల సుందరి తదుపరి చిత్రంలో రణ్‌భీర్‌ కపూర్‌తో రొమాన్స్‌ చేయనుంది.

మరి ఆ సినిమా తర్వాత అయినా వాణి కాలు బయట పెడుతుందో లేక ఆదిత్య చోప్రాకే ఈ జీవితం అంకితమంటూ అక్కడే వుండిపోతుందో చూడాలి. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లు చాలా మంది ఫేడ్‌ అవడంతో వాణి లాంటి వారికి స్పేస్‌ అయితే చాలా వుంది కానీ ఆమె మాత్రం యష్‌రాజ్‌ గడప దాటనంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English