సాహో నక్క.. బాహుబలి నాకలోకం

సాహో నక్క.. బాహుబలి నాకలోకం

ఏదైనా రెండు విషయాల్ని పోలుస్తున్నపుడు.. ఒకదానికి ఇంకోదానికి అసలు పొంతనే లేనపుడు.. నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందనే సామెత వాడుతుంటారు. ఇప్పుడు సాహో సినిమాకు యుఎస్‌లో ప్రి సేల్స్ చూస్తే ఇదే సామెత గుర్తుకు వస్తోంది. బడ్జెట్లో, ప్రి రిలీజ్ బిజినెస్‌లో ‘బాహుబలి’కి దీటైన సినిమాలా కనిపించిన ప్రభాస్ కొత్త చిత్రం ‘సాహో’ వసూళ్ల విషయంలో మాత్రం వెనుకబడేలా కనిపిస్తోంది. అమెరికాలో ఈ సినిమా ప్రి రిలీజ్ బజ్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు.

ప్రిమియర్ల ముందస్తు సేల్స్ ముందు నుంచి ఆందోళనకరంగా ఉండగా.. రిలీజ్ ముందు రోజు పరిస్థితి మారుతుందని అనుకున్నారు. గురువారం ప్రిమియర్స్ కోసం అమెరికా టైమింగ్ ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రి సేల్స్ ద్వారా వసూలైన మొత్తం 1.45 లక్షల డాలర్లు మాత్రమే. అజ్ఞాతవాసి, స్పైడర్, అరవింద సమేత లాంటి మామూలు సినిమాల కంటే ‘సాహో’ ప్రి సేల్స్ తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి సేల్స్ ఈ సమయానికి మిలియన్ డాలర్లను దాటిపోయాయి. ఆ చిత్రం ప్రిమియర్లతోనే దాదాపు 3 మిలియన్ డాలర్ల దాకా కొల్లగొట్టింది. ఐతే ‘సాహో’ ప్రస్తుతం పరిస్థితి చూస్తే ప్రిమియర్లతో మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకునేలా లేదు. 5 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేని సాహో.. ప్రిమియర్లతో మిలియన్ మార్కును కూడా అందుకోకుంటే టార్గెట్ రీచ్ అవడం చాలా కష్టం.

తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’కు తిరుగులేదు. ‘బాహుబలి’కి దీటుగా వసూళ్లు ఓపెనింగ్స్ తెచ్చుకునేలా ఉంది. బయటి రాష్ట్రాల్లో పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. యుఎస్‌లో మాత్రం పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సరిగా సినిమాను ప్రమోట్ చేయకపోవడం, ప్లానింగ్ లేకపోవడం, టికెట్ల రేట్లు ఎక్కువ పెట్టడమే ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English