టెన్షన్‌లో 'యువి - ప్రభాస్‌' క్యాంప్‌

టెన్షన్‌లో 'యువి - ప్రభాస్‌' క్యాంప్‌

సాహో ఫలితం గురించి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానని స్వయంగా ప్రభాసే అన్నాడు. మామూలుగా అయితే హీరోకి అంత టెన్షన్‌ అవసరం లేదు. కానీ ఇది తన స్వంత బ్యానర్‌ సినిమా కావడం వల్ల ప్రభాస్‌ వర్రీ అవుతున్నాడు. బాహుబలి 2 క్రేజ్‌ కారణంగా సాహోకి అంత బడ్జెట్‌ పెట్టినా నిర్మాతలు చాలా వరకు సేవ్‌ అయ్యారు. అలా అని ఈ చిత్రం తేడా కొడితే ఆ తర్వాత వాళ్లు తీసే సినిమాలకి ఇబ్బందులు తప్పవు. అదీ కాక చాలా ప్రాంతాల్లో తాము కోట్‌ చేసిన రేట్లు రాక ఓన్‌ రిలీజ్‌ పెట్టుకున్నారు.

బాహుబలి 2తో సమానంగా వేల్యుయేషన్‌ వేసేసి రికార్డు కొట్టేసామని చెప్పారే కానీ చేతిలోకి అయితే ఇంకా డబ్బులు రాలేదు. దాదాపు వంద కోట్లకి పైగా ఇంకా రిస్కులోనే వుందని ఇండస్ట్రీలో చెబుతున్నారు. ఈ కారణంగానే యువి నిర్మాతలు విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నారట. ప్రభాస్‌ కూడా ఆ టెన్షన్‌ని దాచలేకపోతున్నాడు.

సాహోకి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వస్తే ఈ క్రేజ్‌ వల్ల ఎన్ని కోట్లయినా వచ్చేస్తాయి కానీ టాక్‌ ఏమాత్రం డిజప్పాయింటింగ్‌ అనిపించినా నిర్మాతలతో పాటు కొన్నవాళ్లు కుదేలైపోతారు. హైప్‌ని తగ్గించడానికి గత పది రోజులుగా ముమ్మర యత్నాలు జరిగాయి కానీ హిమాలయమంత హైప్‌ని తగ్గించడం ఎవరి తరం?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English