వెంకీ మామకి తలనొప్పిగా మారిన హీరోయిన్‌!

వెంకీ మామకి తలనొప్పిగా మారిన హీరోయిన్‌!

ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత పాయల్‌ రాజ్‌పుట్‌కి చాలా కాలం అవకాశాలు రాలేదు. ఏవైనా పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తాయని ఎదురు చూసి విసిగిపోయిన తరుణంలో 'ఆర్‌డిఎక్స్‌ 100' అనే బూతు ప్రధాన చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కాస్త ఆగి వుంటే తన టైమ్‌ వచ్చేది కానీ తొందరపడి ఒక చీప్‌ సి-గ్రేడ్‌ సబ్జెక్ట్‌కి ఓకే చెప్పింది.

'ఆర్‌డిఎక్స్‌ లవ్‌' టీజర్‌లో కనీసం ఒక పాతిక సార్లు 'కండోమ్స్‌' గురించిన ప్రస్తావన వుంది. 'సేఫ్టీ' లేకుండా సెక్స్‌ చేయని జంట కథ ఇది. టీజర్‌లో వున్న ఛండాలాన్ని చూసి ఎవరైనా తల పట్టుకోవాల్సిందే. మలయాళంలో వచ్చే సాఫ్ట్‌ పోర్న్‌ సినిమాలకీ దీనికీ ఏమిటి తేడా అని సోషల్‌ మీడియాలో తిట్టి పోస్తున్నారు.

ఆర్‌డిఎక్స్‌ లవ్‌ సంగతి తెలియక పాయల్‌ని 'వెంకీమామ'లో వెంకటేష్‌ సరసన తీసుకున్నారు. ఆర్‌డిఎక్స్‌ ఫస్ట్‌ లుక్‌ని కూడా వెంకీతో రిలీజ్‌ చేయించుకుంది. ఇప్పుడీ టీజర్‌ చూసిన తర్వాత ఆమెపై ఏర్పడే అభిప్రాయానికి తర్వాత వెంకీతో రొమాన్స్‌ చేస్తుంటే ఎలా వుంటుందోనని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. రవితేజ డిస్కోరాజాలో కూడా ఒక హీరోయిన్‌గా పాయల్‌ నటించింది. తనపై చీప్‌ ముద్రని వేసేలా వున్న ఈ చిత్రం బారినుంచి పాయల్‌ ఎలా బయటపడి తర్వాత వచ్చే చిత్రాలతో గౌరవప్రదమైన ఇమేజ్‌ని తెచ్చుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English