ఓవర్సీస్‌లో సాహోని దెబ్బ కొట్టింది వాళ్లే!

ఓవర్సీస్‌లో సాహోని దెబ్బ కొట్టింది వాళ్లే!

బాహుబలి 2 ప్రీమియర్లకి రెండు మిలియన్లకి పైగా గ్రాస్‌ వసూలయిన యుఎస్‌లో సాహో ప్రీమియర్లకి మిలియన్‌ వస్తే గగనం అన్నట్టుంది పరిస్థితి. ఇందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్‌ ప్లానింగే కారణమనే టాక్‌ వినిపిస్తోంది. తెలుగు డిస్ట్రిబ్యూటర్‌కి రైట్స్‌ ఇచ్చినట్టయితే ఈ క్రేజ్‌ని ఎలా క్యాష్‌ చేసుకోవాలనేది వారికి తెలిసి వుండేది. కానీ యష్‌రాజ్‌ సంస్థ రైట్స్‌ తీసుకోవడంతో వారికి ఏ భాషకి ఎన్ని షోలు కేటాయించాలనేది తెలియకుండా పోయింది.

దీంతో తెలుగు వెర్షన్‌కి సగం షోలు ఇచ్చి, మిగతా భాషలకి మిగిలిన షోలు పంచుకుంటూ పోయారు. కానీ హిందీ వాళ్లకి ప్రీమియర్ల ఆనవాయితీ లేదు. అందులోను పాతిక, ముప్పయ్‌ డాలర్లు పెట్టి టికెట్‌ కొనే అలవాటు అసలే లేదు. దీని వల్ల తెలుగు షోలు సోల్డ్‌ అవుట్‌ అవుతూ వుంటే మిగతా షోలు వెలవెలబోతున్నాయి. తొంభై శాతం ప్రీమియర్లు తెలుగుకి కేటాయించి, శుక్రవారం నుంచి మిగతా భాషలకి ముప్పయ్‌ శాతం వరకు పెంచినట్టయితే చాలా బాగుండేదని అక్కడి ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

ప్రీమియర్ల పరంగా ఒక మిలియన్‌ డాలర్లయినా కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఇకనైనా కాస్త అనుభవం వున్న తెలుగు పంపిణీదారుల చేతిలో సినిమా పెడితే ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే అవుట్‌రైట్‌గా ముప్పయ్‌ ఆరు కోట్లకి రైట్స్‌ అమ్మేసిన నిర్మాతలకి దీని వల్ల నష్టమేం లేదు కానీ డిస్ట్రిబ్యూటర్‌కే రావాల్సిన దానికి పడింది చిల్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English