క్రిస్మస్‌కి టాలీవుడ్‌ పంచాయితీ తప్పదు

క్రిస్మస్‌కి టాలీవుడ్‌ పంచాయితీ తప్పదు

సెప్టెంబర్‌ 13న రెండు సినిమాలు క్లాష్‌ అవుతోంటే పలువురు పూనుకుని విడదీసారు. చెరో వారం రమ్మని నచ్చచెప్పారు. మళ్లీ సిమిలర్‌ సిట్యువేషన్‌ క్రిస్మస్‌ వీకెండ్‌లో వచ్చేలాగుంది. ఇప్పటికి డిసెంబర్‌ 20న నాలుగు సినిమాలు అనౌన్స్‌ అయ్యాయి. రవితేజ డిస్కోరాజా, నితిన్‌ భీష్మ, సాయి ధరమ్‌ తేజ్‌ ప్రతిరోజు పండగే, శర్వానంద్‌ 96... ఇవన్నీ కూడా అదే రోజున విడుదలకి సన్నద్ధమవుతున్నాయి. అన్ని సినిమాలు నిర్మాణం చివరి దశలో వున్నాయి కనుక అప్పటికి రెడీ అయిపోతాయి.

అయితే క్రిస్మస్‌ వీకెండ్‌లో ఇన్ని ప్రముఖ చిత్రాలు వస్తే ఖచ్చితంగా ఒకటి రెండయినా ఇబ్బంది పడతాయి. కాబట్టి వీటిలో ఒక రెండు సినిమాలయినా వేరే డేట్‌ చూసుకునేలా సర్దుబాటు చేసుకోవాలి. అల్లు అరవింద్‌, దిల్‌ రాజులాంటి పెద్ద నిర్మాతలు వున్నారు కనుక ఎవరు తగ్గుతారో, ఎవరు మొండికేస్తారో చూడాలి. వారం వెనక్కి జరిగితే బాక్సాఫీస్‌ పరంగా చాలా నష్టం వస్తుంది. అలాగే వారం ముందుకి వచ్చినా వసూళ్ల పరంగా చాలా లోటు కనిపిస్తుంది. వీటిలో వాయిదా పడిన ఏ సినిమా అయినా జనవరి నెలాఖరుకి వెళ్లక తప్పదు కనుక ఈ పంచాయితీ అంత ఈజీగా ఒక కొలిక్కి వచ్చే అవకాశమయితే అస్సల్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English