బూతులోకి మరీ ఇంతగా దిగిపోవాలా?

బూతులోకి మరీ ఇంతగా దిగిపోవాలా?

ఒక హీరోకైనా, హీరోయిన్‌కైనా కెరీర్ ఆరంభంలో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడుతుందన్నది కీలకమైన విషయం. వాళ్లు బలమైన ముద్ర వేసిన పాత్ర తాలూకు ఇమేజ్ అలా కొనసాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకులే కాదు.. ఫిలిం మేకర్స్ కూడా వాళ్ల నుంచి మళ్లీ మళ్లీ అదే ఆశిస్తారు.

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన పాయల్ రాజ్‌పుత్‌కు ఈ సినిమాతో సెక్సీ ఇమేజ్ వచ్చింది. అందులో కుర్రాడిని ముగ్గులోకి దింపి గాఢమైన శృంగారం నెరిపే పాత్రలో పాయల్ జీవించేయడంతో ఆమెపై ఒక ముద్ర పడిపోయింది. దీంతో ఈ ఇమేజ్‌ను వాడేసుకోవడానికి వేరే ఫిలిం మేకర్లు రెడీ అయిపోయారు. ఆల్రెడీ ‘సీత’ సినిమాలో పాయల్ ఒక ఐటెం సాంగ్‌‌లో అందాలు ఆరబోసింది. ఇప్పుడు ‘ఆర్డీఎక్స్ లవ్’ పేరుతో ఒక బి-గ్రేడ్ తరహా సినిమా చేసింది.

‘ఆర్డీఎక్స్ లవ్’ టీజర్ చూసిన వాళ్లంతా ఇది సినిమా టీజరా లేక కండోమ్ యాడా అని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. టీజర్ నిండా బూతు సీన్లు, డైలాగులే ఉన్నాయి. పాయల్ అందాలు మామూలుగా ఆరబోయలేదు. ఆమె హావభావాలు కూడా చాలా ఎరోటిగ్గా ఉన్నాయి. ‘ఆర్ఎక్స్ 100’లో మాదిరి కథానుసారం కాకుండా ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాలో బూతును నింపి సేల్ చేసుకునే ప్రయత్నం జరుగుతున్నట్లుగా ఉంది.

తనపై ఉన్న సెక్సీ ఇమేజ్ తొలగిపోవాలని చూస్తున్నట్లుగా ఇటీవలే మీడియాతో చెప్పిన పాయల్.. ఇంతలా బూతు లోతుల్లోకి దిగిపోయి ఇలాంటి సినిమా ఎందుకు చేసిందో ఏమో మరి. ఓవైపు విక్టరీ వెంకటేష్, రవితేజ లాంటి స్టార్లతో సినిమాలు చేస్తూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న పాయల్.. మధ్యలో ఇలాంటి సినిమా చేయడం ద్వారా తన స్థాయిని తనే తగ్గించుకున్నట్లయింది. ఈ సినిమా వల్ల ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ సినిమాలపై నెగెటివ్ ఎఫెక్ట్ పడినా పడొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English