సీడెడ్‌లో మహేష్‌కి సీన్‌ లేదు!

సీడెడ్‌లో మహేష్‌కి సీన్‌ లేదు!

మిగిలిన ప్రాంతాలలో మహేష్‌ బాబు చిత్రాలకి ఫుల్‌ గిరాకీ వున్నా సీడెడ్‌లో మాత్రం మొదట్నుంచీ బాబు వీకే. మహర్షి చిత్రానికి పన్నెండు కోట్లు పెడితే బయ్యర్‌కి రెండు కోట్ల వరకు లాస్‌ వచ్చింది. పోటీ లేకుండా సమ్మర్‌లో వచ్చిన చిత్రానికే ఆ పరిస్థితి వస్తే సంక్రాంతికి వేరే సినిమాలతో పోటీగా వస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు'కి కూడా పన్నెండు కోట్లు ఇమ్మంటే ససేమీరా అనేసాడట 'మహర్షి' బయ్యరు.

అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురములో', రజనీకాంత్‌-మురుగదాస్‌ల 'దర్బార్‌' సంక్రాంతి బరిలో వున్నాయి కనుక అనిల్‌ రావిపూడి డైరెక్టర్‌ అయినా కానీ 'సరిలేరు నీకెవ్వరు'పై పది కోట్లకి మించి పెట్టుబడి పెట్టనని అంటున్నాడట. దిల్‌ రాజు రెగ్యులర్‌ బయ్యరే ఇలా మొరాయించడంతో ప్రస్తుతం బేరసారాలు జరుగుతున్నాయట.

ఇది కేవలం దిల్‌ రాజు మాత్రమే నిర్మిస్తే రేటు దగ్గర అంత పట్టు పట్టేవాడు కాదేమో కానీ అనిల్‌ సుంకర కూడా తోడవడం వల్ల ఎలాగైనా ఆ బయ్యర్‌ని పన్నెండు కోట్లకి ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. రెండు కోట్లు రిఫండబుల్‌ వుందంటే ఆ బయ్యర్‌ రిస్క్‌ చేస్తాడేమో చూడాలిక. లేదంటే మరో బయ్యర్‌ కోసం వేచి చూడాల్సిందేనట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English