సైరా.. ఇగో వద్దు.. వాయిదా ముద్దు

సైరా.. ఇగో వద్దు.. వాయిదా ముద్దు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న రిలీజ్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. మొన్న టీజర్ లాంచ్ సందర్భంగా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. కానీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చూస్తున్న ఈ చిత్రానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి భారీ హిందీ చిత్రం ‘వార్’ అడ్డంకిగా మారేలా కనిపిస్తోంది.

ఇంతకుముందు ఏదో అనుకున్నారు కానీ.. మొన్న రిలీజైన ఆ మూవీ ట్రైలర్ చూశాక ‘సైరా’ టీం కంగారు పడుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. ‘సైరా’ను ఎంతగా హిందీలో ప్రమోట్ చేయాలని చూస్తున్నా అక్కడ ఏమాత్రం క్రేజ్ వస్తుందో అన్న సందేహాలున్నాయి. బాహుబలితో తిరుగులేని ఇమేజ్, దేశవ్యాప్త ఫాలోయింగ్ సంపాదించిన ప్రభాసే తన తర్వాతి సినిమా ‘సాహో’కు తెలుగు రాష్ట్రాల అవతల ఆశించిన క్రేజ్ సంపాదించలేకపోయాడు.

అలాంటిది చిరు చిత్రానికి వేరే రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఉత్తరాదిన ఆశించిన బజ్ తేగలరా అన్నది సందేహం. కనీసం అక్కడ పోటీ లేకుండా చూసుకుని రిలీజ్ చేయడం కీలకం. కానీ ‘వార్’ లాంటి భారీ అంచనాలున్న చిత్రం రేసులో ఉండగా ‘సైరా’ను విడుదల చేస్తే కచ్చితంగా పంచ్ పడుతుంది. చిరు సినిమాను ఉత్తరాది వాళ్లు పట్టించుకోవడం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో సినిమాను వారం లేటుగా.. దీపావళి దసరా టైంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఐతే ‘వార్’కు భయపడి చిరు సినిమాను వాయిదా వేయడం ఏంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఐతే ఇలా ఆలోచించి ఇగోకు పోతే సినిమాకు నష్టం వాటిల్లడం ఖాయం. ఎంతైనా చిరు మిగతా రాష్ట్రాల్లో మెగాస్టార్ కాదన్న విషయం అంగీకరించాలి. సినిమాను ఎక్కువమందికి చేరువ చేయాలంటే.. ఆశించిన ఫలితం రాబట్టాలంటే ఇగో పక్కన పెట్టి వాయిదా వేయడమే కరెక్ట్ అన్నది బాక్సాఫీస్ నిపుణుల అభిప్రాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English