బ్లాక్‌బస్టర్‌ హీరోకి ఫ్లాప్‌ భయం!

బ్లాక్‌బస్టర్‌ హీరోకి ఫ్లాప్‌ భయం!

కెరియర్‌ ఒక రేంజ్‌లో సాఫీగా సాగిపోతూ వుంటే ఏమీ ఫర్వాలేదు కానీ ఒకేసారి పెద్ద విజయం వచ్చి గ్రాఫ్‌ ఒక్కసారిగా అలా అలలా పైకి లేస్తే మాత్రం మళ్లీ పడిపోతాననే భయం ఎవరినైనా వెంటాడుతుంది. ఇస్మార్ట్‌ శంకర్‌ అంత హిట్‌ అయిపోతుందని రామ్‌ కలలో అయినా ఊహించి వుండడు. ఎందుకో జనాలు దాంతో కనక్ట్‌ అయిపోయి దానికి వైరల్‌ సక్సెస్‌ దక్కింది.

రామ్‌ సినిమాలకి రెగ్యులర్‌గా వచ్చే వసూళ్లకి రెండింతలు ఇస్మార్ట్‌ శంకర్‌కి వచ్చింది. దీంతో ఈ సక్సెస్‌ని నిలబెట్టుకోవడం ఎలాగనేది రామ్‌కి తెలీడం లేదు.

ఇస్మార్ట్‌ రిలీజ్‌ కాకముందు ఓకే చేసిన ప్రాజెక్టులని కాన్సిల్‌ చేసేసి 'అంతకుమించిన' కథలు వుంటే పట్టుకురమ్మని ఆ దర్శకులకి చెప్పేసాడు. అలాగే అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలకి కూడా అమౌంట్‌ రిటర్న్‌ ఇచ్చేసి తదుపరి చిత్రం కోసం తగిన కథ దొరికే వరకు వేచి చూడాలని డిసైడ్‌ అయ్యాడు.

ఇప్పుడు కనుక వెంటనే ఒక భారీ విజయం అందిస్తే తన మార్కెట్‌ కన్సాలిడేట్‌ అవుతుందని రామ్‌కి తెలుసు. అదే ఇప్పుడు రాంగ్‌ స్టెప్‌ వేసాడో తర్వాత మళ్లీ ఇస్మార్ట్‌ శంకర్‌ లాంటి సినిమా రాదు. గతంలో చాలా సార్లు ఒక సక్సెస్‌ వచ్చిన తర్వాత రామ్‌ రాంగ్‌ స్టెప్స్‌ వేసి చేతులారా సమస్యలు కొని తెచ్చుకున్నాడు. ఈసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ క్రమంలో అయిదారు నెలలు ఖాళీగా వున్నా ఓకే అని ఫిక్స్‌ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English