పాయల్‌ రాజ్‌పుట్‌... బూతు పోస్టర్లు!

పాయల్‌ రాజ్‌పుట్‌... బూతు పోస్టర్లు!

ఆర్‌ఎక్స్‌ 100 చిత్రానికి పాయల్‌ రాజ్‌పుట్‌ స్కిన్‌ షో బాగా హెల్ప్‌ అయిందనే భావనతో ఆమెతో 'ఆర్‌డిఎక్స్‌ లవ్‌' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాయల్‌ గ్లామర్‌తోనే వసూళ్లు రావాలన్నట్టు ఆమె అందాల ప్రదర్శన చేసిన పోస్టర్లే ప్రచారానికి వాడుతున్నారు.

తడిసిన లంగా ఒంటికి చుట్టుకుని వున్న పోస్టర్‌ రిలీజ్‌ చేయగా, ఆ మాత్రం డోస్‌ సరిపోదని భావించారేమో మళ్లీ మరో బూతు అర్థం వచ్చే పోస్టర్‌ని వదిలి జనాల దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎదురుగా పాయల్‌ అందాలు ఆరబోస్తూ ఆదమరిచి నిద్రపోయి వుంటే, ఆమెని తదేకంగా చూస్తోన్న తేజస్‌ చేతిలోని కొబ్బరిబొండాల లోంచి నీళ్లు జుర్రేస్తున్నాడు.

అతని చూపులు ఎక్కడ వున్నాయో, ఆ చేతిలోని బొండాలకి అర్థమేమిటో ఇట్టే చెప్పవచ్చు. బాలీవుడ్‌లో అడల్ట్‌ కామెడీ చిత్రాలకి ఈ తరహా పోస్టర్లు వదిలే వారు. ఇప్పుడు ఆ జాఢ్యం తెలుగు చిత్ర సీమకి కూడా అంటినట్టుంది. ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్‌ లాంటి సీనియర్‌ నిర్మాత నిర్మించడం గమనార్హం.

ఆర్‌ఎక్స్‌ 100 సక్సెస్‌కి ఏదయితే దోహదపడిందో దానిని రెండింతలు చూపిస్తే ఆర్‌డిఎక్స్‌ లవ్‌ కూడా బాంబ్‌లా పేలుతుందనేది మేకర్స్‌ ఉద్దేశం. కానీ ఇలాంటి వాటికి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ పడతారనే దాఖలాలు అంతగా లేవనేది నిజం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English