అల్లు అర్జున్‌ని ఎదిరించలేక కాంప్రమైజ్‌!

అల్లు అర్జున్‌ని ఎదిరించలేక కాంప్రమైజ్‌!

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలొస్తే, ఒక చిన్న సినిమాకి కూడా స్పేస్‌ వుంటుందని సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్‌ప్రెస్‌ రాజా, శతమానం భవతి లాంటి విజయాలు నిరూపించాయి. అలాగే సంక్రాంతికి సరిగ్గా సరిపోయే సినిమా తీస్తోన్న సాయి ధరమ్‌ తేజ్‌, మారుతి కూడా 'ప్రతిరోజు పండగే' చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలని ఆశ పడ్డారు.

కానీ సంక్రాంతికి రిలీజ్‌ అవుతోన్న రెండు పెద్ద సినిమాలలో ఒకటి అల్లు అర్జున్‌ది కావడంతో, 'ప్రతిరోజు పండగే' నిర్మాతలలో అల్లు అరవింద్‌ కూడా వుండడంతో ఆ సాహసం చేయలేకపోతున్నారు.

చూస్తూ చూస్తూ తేజ్‌ తమ ఫ్యామిలీ హీరో చిత్రానికి ఎదురు వెళ్లలేడు. అలాగే మారుతికి కూడా అల్లు వారితో సత్సంబంధాలున్నాయి కనుక అతనూ ఆ డేట్‌ కావాలని బలవంత పెట్టలేడు. అలా అయిష్టంగానే 'ప్రతి రోజు పండగే' క్రిస్మస్‌ వీకెండ్‌కి మారింది. క్రిస్మస్‌ టైమ్‌ కూడా మంచి సీజనే కానీ మల్టిపుల్‌ సినిమాలు ఆడేయడం జరగదు. కానీ ఈసారి క్రిస్మస్‌కి పోటీ తీవ్రంగా వుండేట్టుంది.

ఆల్రెడీ తేజ్‌తో పాటు నితిన్‌ 'భీష్మ' కూడా క్రిస్మస్‌ రిలీజ్‌ ఖాయమని అనౌన్స్‌ చేసేయడం జరిగింది. అదే సంక్రాంతికి అయితే ఎన్ని సినిమాలు విడుదలైనా కానీ బాగున్నాయనే టాక్‌ వచ్చిన అన్నిటికీ సక్సెస్‌ దక్కడం గ్యారెంటీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English