నాగచైతన్యని తిట్టిస్తోన్న సమంత!

నాగచైతన్యని తిట్టిస్తోన్న సమంత!

అక్కినేని వారింటి కోడలయిన తర్వాత కాస్త పద్ధతిగా కనిపించాలంటూ ఇప్పటికే సమంతకి పలుమార్లు అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా విన్నపాలు పెట్టుకున్నారు. పెళ్లయిన తర్వాత కూడా ప్రైవేట్‌ పిక్స్‌లో ఎక్స్‌పోజింగ్‌ చేస్తోందంటూ చాలా మంది మండి పడ్డారు. ఎవరు తన గురించి ఏమనుకున్నా తనకేమీ నష్టం లేదన్నట్టు సమంత తన ధోరణిలో తాను వెళ్లిపోతోంది. ఇందుకు నాగచైతన్య కూడా అభ్యంతరం చెబుతున్నట్టు లేడు.

తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హాట్‌ ఫోటో పోస్ట్‌ చేసింది. దాదాపు స్విమ్‌సూట్‌ని ప్రతిబింబించే చిన్ని కాస్టూమ్‌లో సమంత పిచ్చ హాట్‌గా కనిపిస్తోంది. స్పెయిన్‌లో చైతన్యతో కలిసి హాలిడే ఎంజాయ్‌ చేస్తోన్న సమంత ఫాన్స్‌కోసం ఈ ఫోటో పోస్ట్‌ చేయడమే కాకుండా ఫోటో తీసింది చైతన్యేనని కూడా తెలియజేసింది. దీంతో మామూలుగా సమంతని ఎటాక్‌ చేసే ట్రోలర్స్‌ చైతన్యని తిట్టి పోస్తున్నారు.

ఆమె ఇలాంటి బట్టలేసుకున్నపుడు ఫోటోలు తీయడమెందుకు, అవి నెట్‌లో పెట్టనివ్వడమెందుకు అని చైతన్యకి క్లాస్‌ పీకుతున్నారు. అయితే బాలీవుడ్‌లో పెళ్లయిన జంటలు ఇంతకుమించిన ఫోటోలే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. మారిన ట్రెండుకి తగ్గట్టు వున్నారని అనుకోకుండా ప్రతి సారీ ఇలా వాళ్ల ప్రైవసీని ఎటాక్‌ చేసే కామెంట్లు పెట్టడం వల్ల ఏమొస్తుంది. తెరపై పద్ధతయిన పాత్రలు పోషిస్తూ మనసులు గెలుచుకుంటోన్న సమంత కనీసం హాలిడేకి వెళ్లినపుడు అయినా తనకి కావాల్సినట్టు వుండకూడదంటే ఎలాగండీ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English