రాజమౌళి కూడా సెంటిమెంటు దాసుడే

రాజమౌళి కూడా సెంటిమెంటు దాసుడే

ఎంత వారలైనా కాంత దాసులే అనేది సామెత. సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఎంత వారలైనా సెంటిమెంటు దాసులే అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ కావడంతో సెంటిమెంట్లను విపరీతంగా పాటిస్తుంటారు. పెద్ద పెద్ద వాళ్లు కూడా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవడం చూసి ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇప్పటిదాకా కెరీర్లో ఫెయిల్యూర్ లేని రాజమౌళి సైతం తన కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఒక లొకేషన్‌ను సెంటిమెంటుగా భావించి అక్కడ షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం.

తన కెరీర్లో అతి పెద్ద హిట్టుగా నిలిచిన ‘బాహుబలి’ కోసం బల్గేరియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు జక్కన్న. ‘ది బిగినింగ్’లో మంచు పర్వాతాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడ తీసినవే. ఇప్పుడు అదే చోట ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఒక షెడ్యూల్ ప్లాన్ చేశారు.

కొంత బ్రేక్ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ బల్గేరియాలోనే ఆరంభం అవుతున్నట్లు అధికారికంగానే సమాచారం బయటికి వచ్చింది. ‘బాహుబలి’ షూటింగ్ టైంలోనే బల్గేరియాలో మరిన్ని చోట్ల తిరిగి భవిష్యత్తులో ఏదైనా సినిమాలకు అవసరమవుతాయేమో అని లొకేషన్స్ చూసి పెట్టుకున్న రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’లో ఓ కీలక ఎపిసోడ్ కోసం ఆ దేశాన్ని ఎంచుకున్నాడు.

మరి పూర్తిగా ఇండియాలో సాగాల్సిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల కథలకు బల్గేరియా నేపథ్యాన్ని ఎలా జోడిస్తాడో జక్కన్న చూడాలి. ఇప్పటిదాకా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కు తరచుగా బ్రేక్‌లు వస్తున్నాయి. ఇప్పటికి అనుకున్న స్థాయిలో చిత్రీకరణ పూర్తి కాలేదు. ఇక నుంచి విరామం లేకుండా షూటింగ్ చేసి డెడ్ లైన్ అందుకునే ప్రయత్నం చేయాలని జక్కన్న భావిస్తున్నాడు. కొత్త షెడ్యూల్లో హీరోలిద్దరూ పాల్గొంటున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English