ప్రభాస్ చెప్పిన సచిన్ ఎగ్జాంపుల్ అదుర్స్

ప్రభాస్ చెప్పిన సచిన్ ఎగ్జాంపుల్ అదుర్స్

ప్రభాస్‌లో అందరికీ నచ్చే లక్షణం.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు, మార్కెట్ సంపాదించి.. బాలీవుడ్ హీరోలు సైతం అందుకోలేని స్థాయికి ఎదిగినా కాస్తయినా ప్రభాస్‌లో గర్వం కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అతనెంత అణకువతో ఉంటున్నాడో సినిమా ప్రమోషన్లలో చూస్తూనే ఉన్నాం.

టీవీ ఇంటర్వ్యూల్లో అతను చేస్తున్న వ్యాఖ్యలు విని వేరే హీరోల అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఎవరినీ తక్కువ చేయకుండా.. అందరు హీరోలనూ పొగుడుతూ తనపై ఏమాత్రం నెగెటివిటీ లేకుండా చూసుకుంటున్నాడు ప్రభాస్. అలాగని అతనేమీ ప్లాన్ చేసి.. కృత్రిమంగా ఏమీ మాట్లాడుతున్నట్లు అనిపించడం లేదు. నిజాయితీగానే మాట్లాడుతున్న సంగతి గమనిస్తే అర్థమవుతుంది.

బాలీవుడ్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చలాయిస్తున్న ఖాన్స్‌ను కూడా ప్రభాస్ ఇప్పుడు మించిపోయాడన్నది వాస్తవం. ‘బాహుబలి’ రాజమౌళి మ్యాజిక్ అనుకున్నా.. ఇప్పుడు ‘సాహో’ కేవలం ప్రభాస్ పేరు మీద సేల్ అవుతోంది. రూ.350 కోట్ల బడ్జెట్.. రూ.450 కోట్ల బిజినెస్ అంటే మాటలు కాదు. ఇదంతా ప్రభాస్ క్రెడిట్టే. ఈ ఫిగర్స్ బాలీవుడ్ ఖాన్స్ కూడా సాధించలేనివి. ఈ నేపథ్యంలో వాళ్లను మీరు మించిపోయినట్లున్నారు కదా అని ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ను అడిగితే.. అతను చెప్పిన సమాధానం అదుర్స్ అనే చెప్పాలి.

సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఎంతో సాధించాడని.. మరి ఎవరైనా కొత్త ఆటగాడు వచ్చి ఒక డబుల్ సెంచరీ చేసి సచిన్‌ కంటే ఎక్కువ స్కోరు సాధించినంత మాత్రాన అతడిని మించిన వాడు అనొచ్చా అని ప్రభాస్ ప్రశ్నించాడు. ‘బాహుబలి’తో తాను సాధించిన సక్సెస్ కూడా అలాంటిదే అని సింపుల్‌గా తేల్చేశాడు ప్రభాస్. ఖాన్స్ ఎన్నో సాధించారని.. ఎన్నో రకాలుగా తమను తాము ప్రూవ్ చేసుకున్నారని.. ‘బాహుబలి’ సక్సెస్ చూసి దాన్ని వేరే సినిమాలతో పోల్చి ఎవరినీ తక్కువ చేయకూడదని చెప్పడం ద్వారా బాలీవుడ్ జనాల మనసులు దోచేశాడు ప్రభాస్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English