సుకుమార్‌ ఎత్తుని చిత్తు చేసిన బన్నీ

సుకుమార్‌ ఎత్తుని చిత్తు చేసిన బన్నీ

అల్లు అర్జున్‌తో అంత వీజీ కాదు... మామూలుగానే తన సినిమాలు మినిమం గ్యారెంటీ అయ్యేలా చూసుకోవడం అతనికి అలవాటు. అలాంటిది ఫ్లాప్‌ వచ్చి, కాస్త గ్యాప్‌ వచ్చిన తర్వాత అంత తేలికగా దేనికైనా ఎందుకు లొంగుతాడు? మహేష్‌బాబు రిజెక్ట్‌ చేసిన స్టోరీ లైన్‌ని అల్లు అర్జున్‌తో ఓకే చేయించుకున్న సుకుమార్‌ దానిని ఇంతవరకు సరిగా డెవలప్‌ చేయలేకపోయాడు. అనేక డౌట్లు అల్లు అర్జున్‌ ఎక్స్‌ప్రెస్‌ చేయడంతో దానికి నగిషీలు చెక్కడంతోనే సుకుమార్‌ గడ్డం మరింత నెరిసిపోయిందని జోకులేసుకుంటున్నారు.

అయితే అల్లు అర్జున్‌ని కార్నర్‌ చేయడానికా అన్నట్టు... శ్రావణ మాసం రాగానే పూజా కార్యక్రమం జరిగిపోతుందని, సెప్టెంబర్‌లో షూటింగ్‌ మొదలు అయిపోతుందని సుకుమార్‌ తన పీఆర్‌ టీమ్‌ ద్వారా లీక్‌ చేసాడు. త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్‌లో వుండి సుకుమార్‌తో ఎలా షూటింగ్‌ చేస్తాడని కూడా డౌట్లు వ్యక్తం చేసారు. అయితే సుకుమార్‌ ఎన్ని ఎత్తులు వేసినా అల్లు అర్జున్‌ ఇంతవరకు దిగి రాలేదు. ఎలాగయినా పూజా కార్యక్రమం చేయించేసి తన సినిమా కమిట్‌ చేయించేయాలని సుకుమార్‌ చూస్తున్నాడు.

స్టోరీ లాక్‌ అయ్యే వరకు మొదలు పెట్టే ప్రసక్తే లేదని, ఆల్రెడీ అలా సగం సగం కథతో 'అల వైకుంఠపురములో'కి ఇబ్బందులు పడుతున్నానని బన్నీ తేల్చేసాడు. త్రివిక్రమ్‌ సినిమా పూర్తయ్యేలోగా సుకుమార్‌ పూర్తిగా అల్లు అర్జున్‌ని మెప్పించాడా సరి. లేదంటే 'ఐకాన్‌' చిత్రానికి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌తో సహా అన్నీ జరిగిపోయి ఎప్పుడంటే అప్పుడు మొదలు పెట్టుకునేలా వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English