సాహోతో పోల్చుకోవ‌ద్దు సైరా

సాహోతో పోల్చుకోవ‌ద్దు సైరా

మెగాస్టార్ చిరంజీవి అంటే బాక్సాఫీస్ బంగారం. ఆయ‌న ఫ్లాప్ సినిమాలు కూడా బ‌య్య‌ర్ల‌ను సేఫ్ జోన్లోనే ఉంచేవి ఒక‌ప్పుడు. సినిమా హిట్ట‌యితే ఇక లాభాల పంటే. బ‌డ్జెట్, బిజినెస్ అన్నీ అన్నీ ప‌క్కాగా లెక్క‌లు వేసుకుని రంగంలోకి దిగేవాళ్లు ఒక‌ప్పుడు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ డైన‌మిక్స్ అన్నీ మారిపోయాయి. అయిన‌కాడికి బ‌డ్జెట్ పెంచేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే బిజినెస్ చేస్తున్నారు.

దీంతో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సినిమా తేడా వ‌స్తే బ‌య్య‌ర్లు నిలువునా మునిగిపోతున్నారు. నిజానికి పెద్ద హీరోల సినిమాలే బ‌య్య‌ర్లను మ‌రింత‌గా ముంచేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పుడు ఈ రిస్కీ స‌ర్క‌స్‌లో భాగం అయిపోయారు. ఆయ‌న కొత్త సినిమా సైరా న‌రసింహారెడ్డి బ‌డ్జెట్ రూ.250 కోట్ల దాకా చెబుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే బిజినెస్ సెట్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

ప్ర‌తి ఏరియాలోనూ రికార్డు రేట్ల‌కు సినిమాను అమ్మాల‌ని చూస్తున్నారు. ఒక‌ప్పుడు చిరు సినిమాకు ఎంత రేటంటే అంత క‌ళ్లు మూసుకుని పెట్టేసేవాళ్లు బ‌య్య‌ర్లు. కానీ ఇప్పుడు భ‌య‌ప‌డుతున్నారు. తెలుగు గ‌డ్డ మీద చిరుకు ఎదురు లేక‌పోవ‌చ్చు. క‌ర్ణాట‌క‌లో కూడా ఓకే. కానీ మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల్లో, ఉత్త‌ర భార‌తంలో, ఓవ‌ర్సీస్‌లో కూడా ఆయ‌న కింగ్ అనుకుంటే పొర‌బాటే. ఈ మార్కెట్ల‌లో ప్ర‌భాస్ సినిమా సాహోతో చిరు చిత్రం సైరాను పోల్చి చూస్తే క‌ష్టం. బాహుబ‌లితో ప్ర‌భాస్‌కు వ‌చ్చిన గుర్తింపు వేరు. సాహోకు ఆ గుర్తింపును నిల‌బెట్టుకున్నాడు.

అత‌డి క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. తెలుగు రాష్ట్రాల్లో అత‌డి మార్కెట్ అమాంతం పెరిగింది. కొత్త ఏరియాల్లోనూ స్ట్రాంగ్ మార్కెట్ ఏర్ప‌డింది. ముఖ్యంగా ఉత్త‌రాదిన ప్ర‌భాస్ క్రేజ్ చూసి బాలీవుడ్ స్టార్లు కూడా కంగారు ప‌డే ప‌రిస్థితి ఉంది. ఐతే మారిన ప‌రిస్థితులు అర్థం చేసుకోకుండా చిరుకేం త‌క్కువ అంటూ అన్ని చోట్లా భారీ రేట్ల‌ను పెట్టి మెగాస్టార్ రేంజ్ చూపించాల‌ని తాప‌త్ర‌య ప‌డితే మొద‌టికే మోసం రావ‌చ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English