అతడితో ఇలియానా బ్రేకప్?

అతడితో ఇలియానా బ్రేకప్?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిపోయాక ఇలియానా చాలా మారిపోయింది. ఆమె మాటల్లో, అప్పీయరెన్స్‌లో చాలా మార్పు వచ్చింది. అంతకుముందెన్నడూ చూడని బోల్డ్‌నెస్‌తో ఆమె షాకిచ్చింది. హైదరాబాద్‌లో ఉన్నన్నాళ్లూ ఎఫైర్లేమీ నడపని ఇల్లీ బేబీ.. బాలీవుడ్ బాట పట్టగానే ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ‌తో రిలేషన్‌షిప్ మొదలుపెట్టింది.

వీళ్లిద్దరూ ఐదేళ్ల ముందు నుంచే ప్రేమలో ఉన్నారు. చాలా ఏళ్లు సహజీవనం చేశాక ఏడాది కిందట పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి ఫొటోలు పెడుతుంటారు. ఇల్లీని ఆండ్రూ ఫొటోలు తీస్తున్న చిత్రాలు కూడా దర్శనమిస్తుంటాయి. వీరి బంధం అంతకంతకూ బలపడుతున్నట్లే కనిపించింది. కానీ ఇప్పుడేమో ఉన్నట్లుండి ఇల్లీ-ఆండ్రూ విడిపోయారన్న వార్త బాలీవుడ్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

సెలబ్రెటీలు ఒకరితో విడిపోయారనే సందేహాలు కలిగేది వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లలో జరిగే మార్పుల గురించే. తాము రిలేషన్ షిప్‌లో ఉన్న వ్యక్తితో ఉన్న ఫొటోల్ని డెలీట్ చేయడం.. వాళ్లను అన్ ఫాలో చేయడం లాంటివి చేసి ఈ రకమైన సంకేతాలిస్తుంటారు నెటిజన్లు. ఇలియానా ఈ పని చేయడమే ఇప్పుడీ సందేహాలకు కారణం.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆండ్రూతో ఉన్న ఫొటోలన్నింటినీ ఆమె డెలీట్ చేసింది. అంతే కాదు.. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య బంధం బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. విడిపోనపుడు ఇలా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలియానాతో ఆండ్రూ పెళ్లి విషయంలో ఇప్పటికీ సందేహాలున్నాయి. ఎప్పుడూ కూడా తమ పెళ్లి గురించి స్పష్టంగా, అధికారికంగా ఇల్లీ వెల్లడించలేదు.

కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ దిశగా సంకేతాలిచ్చింది. ఐతే వీరి బంధం ఎక్కడిదాకా వెళ్లిందో ఏమో కానీ.. ఇల్లీ ముంబయిలోనే ఉంటోంది. ఆండ్రూ ఆస్ట్రేలియాలోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడూ అతను ముంబయికి వచ్చి వెళ్తున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో అతను ఇక ఎప్పటికీ ముంబయికి రాడేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English