నాని గ్యాంగ్‌లీడ‌ర్‌లో చిరు ఫ్యాన్స్‌కు ట్రీట్

నాని గ్యాంగ్‌లీడ‌ర్‌లో చిరు ఫ్యాన్స్‌కు ట్రీట్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో క‌ల్ట్ మూవీగా నిలిచింది గ్యాంగ్ లీడ‌ర్‌. అది చాలా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌. మెగా అభిమానులు చాలా ప్ర‌త్యేకంగా భావించే టైటిల్‌. మ‌ళ్లీ ఆ టైటిల్ వాడితే చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణే వాడాల‌న్న‌ది వారి కోరిక‌. కానీ నేచుర‌ల్ స్టార్ నాని త‌న కొత్త‌ చిత్రానికి గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్ పెట్టుకుని మెగా అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు.

ఓ చిరంజీవి అభిమాని వీళ్ల కంటే ముందు గ్యాంగ్ లీడ‌ర్ టైటిల్‌తో సినిమా తీస్తూ నాని చిత్రానికి లీగ‌ల్ ట్ర‌బుల్ ఇచ్చాడు. ఓవైపు మెగా అభిమానుల ఆగ్ర‌హం.. ఇంకోవైపు లీగ‌ల్ త‌ల‌నొప్పులు ఎదురైనా నాని అండ్ టీమ్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. టైటిల్ ముందు నానీస్ అని యాడ్ చేసి ముందుకు వెళ్లిపోయింది. ఇదే టైటిల్‌తో సినిమాను రిలీజ్ చేయ‌బోతోంది.

ఐతే ఎక్క‌డ మెగా అభిమానులు విడుద‌ల స‌మ‌యంలో అడ్డం ప‌డ‌తారో.. సినిమా గురించి నెగెటివ్ ప్ర‌చారం చేస్తారో అనే భ‌యం చిత్ర బృందంలో ఉన్న‌ట్లే ఉంది. అందుకే వారి మ‌న‌సులు గెలిచే ప్ర‌య‌త్నం చేస్తోంది. మొన్న మెగాస్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్యాంగ్‌లీడ‌ర్‌లో చిరు త‌ర‌హాలోనే గ్యాస్ లైట‌ర్ ప‌ట్టుకున్న స్టిల్‌ను త‌ల‌పిస్తూ నానితో ఒక పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అయినా మెగా అభిమానుల్లో ఏ మార్పూ వ‌చ్చిన‌ట్లు లేదు.

దీంతో తాజాగా ఈ చిత్ర హీరోయిన్ ప్రియాంక‌ను ప‌రిచ‌యం చేస్తూ పెట్టిన ప్రెస్ మీట్లో మెగా అభిమానుల్ని ఊరించే మాట ఒక‌టి చెప్పాడు నాని. చిరు గ్యాంగ్ లీడ‌ర్‌కు త‌మ గ్యాంగ్ లీడ‌ర్‌కు ఎలాంటి పోలిక లేద‌ని.. ఐతే చిరు సినిమాకు ట్రిబ్యూట్‌లా, మెగా అభిమానుల‌కు ట్రీట్ లాగా.. వాళ్లు థియేట‌ర్ల‌లో గోల చేసేలా ఒక స‌న్నివేశం త‌మ సినిమాలో ఉంటుంద‌ని నాని వెల్ల‌డించాడు. మ‌రి ఆ ట్రీట్ ఏంటో చూడాలి. మ‌రోవైపు సెప్టెంబ‌రు 13న గ్యాంగ్ లీడ‌ర్ వ‌స్తుందా రాదా అనే సందేహాల‌కు తెర‌దించుతూ ఆ రోజే సినిమా రిలీజ‌వుతుంద‌ని నాని స్ప‌ష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English