'బాహుబలి'కి వున్న ధైర్యం 'సాహో'కి లేదు!

'బాహుబలి'కి వున్న ధైర్యం 'సాహో'కి లేదు!

'బాహుబలి 2' చిత్రానికి విడుదలకి ముందు రోజు సెకండ్‌ షోల నుంచే రెగ్యులర్‌ ప్రీమియర్లు వేసేసారు. భారీ అంచనాలతో వస్తోన్న సినిమా అయినా కానీ విజయంపై ఎలాంటి అనుమానం లేకపోవడంతో అప్పుడు ధైర్యం చేసేసారు. అలాగే 'సాహో'కి కూడా పెయిడ్‌ ప్రీమియర్లు వుంటాయనే ప్రచారం చాలా కాలంగా చేస్తున్నారు. అయితే విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ నిర్మాతలు డిఫెన్స్‌లో పడ్డట్టున్నారు. ఎటుపోయి ఎటు వస్తుందో అన్నట్టుగా పెయిడ్‌ ప్రీమియర్లు కాన్సిల్‌ చేసుకున్నారు.

కానీ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో అయిదేసి షోలు వేయడం కోసం ఆయా ప్రభుత్వాలకి అర్జీ పెట్టుకున్నారు. సాహో ఎర్లీ షోల పరంగా ఇంతవరకు స్పష్టమైన సమాచారం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ముందుగా షోలు ఎక్కడ పడతాయో అంటూ అభిమానులు హైరానా పడుతున్నారు. తెలంగాణలో కూడా అర్థరాత్రి దాటిన తర్వాత బెనిఫిట్‌ షోస్‌ వేయాలనే ప్రతిపాదన వుంది కానీ ఇంతవరకు దానికి పర్మిషన్‌ లేదు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం మాదిరిగా ఇలాంటి వ్యవహారాలకి జగన్‌ ప్రభుత్వం అనుకూలంగా వుంటుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English