దిల్‌ రాజు కంట్రోల్‌లోకి శర్వానంద్‌

దిల్‌ రాజు కంట్రోల్‌లోకి శర్వానంద్‌

హీరోలని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం దిల్‌ రాజుకి ఇష్టమని అంటూ వుంటారు. అందుకే కొందరు హీరోలకి మార్కెట్‌ లేకపోయినా కానీ తన బ్యానర్లో సినిమాలు ఇస్తూ వుంటాడట. అయితే ఆల్రెడీ మార్కెట్‌ వున్న హీరోలు అంత తేలికగా ఎవరి మాట వినరు. మామూలుగా అయితే శర్వానంద్‌ కూడా అదే బాపతుకి చెందాలి కానీ ఇటీవల వరుసగా రెండు ఫ్లాపులు పడడంతో శర్వానంద్‌ వర్రీ అవుతున్నాడు. అసలే తన రేంజ్‌ హీరోల మధ్య పోటీ తీవ్రతరమయి ఎప్పటికప్పుడు ఒక కొత్త హీరో లీడ్‌లోకి వెళుతున్నాడు.

ఇలాంటి టైమ్‌లో వరుసగా ఫ్లాపులు పడితే ఎవరయినా షేక్‌ అవుతారు. పడి పడి లేచె మనసు, రణరంగం తర్వాత మరో ఫ్లాప్‌కి శర్వానంద్‌ సిద్ధంగా లేడు. అందుకే తదుపరి రాబోతోన్న 96 విషయంలో దిల్‌ రాజుకే అన్నీ అప్పగించేసాడు. ఈ సినిమాతో ఎలాగయినా మంచి హిట్‌ ఇమ్మంటూ అతడి మీదే భారం మోపేసాడు. 96 తమిళంలో ప్రూవ్డ్‌ సబ్జెక్ట్‌ అవడంతో పాటు శర్వానంద్‌కి సూటయ్యే లవర్‌బాయ్‌ క్యారెక్టర్‌. అలాగే సమంత ఫ్యాక్టర్‌ కూడా ప్లస్‌ అవుతుంది కనుక ప్రమోషన్స్‌ సరిగ్గా చేసి రిలీజ్‌ పక్కాగా ప్లాన్‌ చేస్తే మిస్‌ఫైర్‌ అవడానికి ఆస్కారమే లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English