బిగ్‌బాస్‌ వరుణ్‌ గాళ్‌ఫ్రెండ్‌ని పంపిస్తాడా?

బిగ్‌బాస్‌ వరుణ్‌ గాళ్‌ఫ్రెండ్‌ని పంపిస్తాడా?

ఈసారి బిగ్‌బాస్‌ షో చాలా మామూలుగా, ప్రిడిక్టబుల్‌గా జరిగిపోతోంది. నామినేషన్లు అనౌన్స్‌ అవగానే ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఈజీగా గెస్‌ కొడుతున్నారు. మొదట్లో అదే పనిగా కీచులాడుకున్న హౌస్‌మేట్స్‌లో ఒకరిద్దరు మినహా అంతా సఖ్యంగానే వుంటున్నారు. 'ఈవారం కెప్టెన్సీ నువ్వు తీసుకో అంటే నువ్వు తీసుకో' అంటూ వంతులు వేసుకుని టాస్క్‌లలో కూడా పోటీ తత్వం లేకుండా వన్‌సైడెడ్‌గా ఆడేస్తున్నారు. దీంతో ఈ బృందానికి బలమైన టాస్క్‌లు పెట్టడం కూడా దండగే అన్నట్టు బిగ్‌బాస్‌ కూడా వారితో చమ్మచక్క, కోతి కొమ్మచ్చిలాంటివి ఆడిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.

స్పైస్‌ తగ్గిపోయిన నేపథ్యంలో హౌస్‌లో కలకలం రేపడానికి, కామ్‌ అండ్‌ కంపోజ్డ్‌గా వున్న వరుణ్‌ సందేశ్‌ని కార్నర్‌ చేయడానికి శ్రద్ధా దాస్‌ని వైల్డ్‌ కార్డ్‌గా పంపిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. శ్రద్ధా దాస్‌తో వరుణ్‌ సందేశ్‌కి అప్పట్లో ఘాటైన అఫైరే నడిచింది. అతని వల్ల ఆమె డిప్రెషన్‌కి కూడా గురయినట్టుగా వార్తలొచ్చాయి.

శ్రద్ధ హౌస్‌లోకి వెళితే మాత్రం ఇటు భార్య, అటు మాజీ ప్రియురాలు మధ్య వరుణ్‌ సతమతమవుతాడు. సాధారణంగా అయిదు వారాల తర్వాత వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ వుంటుంది కనుక ఈ మిడ్‌ వీక్‌లోనే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ జరుగుతుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English