సమంతపై నాగార్జున గుస్సా?

సమంతపై నాగార్జున గుస్సా?

మామా కోడళ్లకి పడడం లేదా? టాలీవుడ్‌లో వినిపిస్తోన్న తాజా గాసిప్స్‌లో ఇదొకటి. నాగార్జున తీసుకుంటోన్న కొన్ని నిర్ణయాలు సమంతకి నచ్చడం లేదట. ఇటీవల మన్మథుడు 2 చిత్రంతో నాగార్జున చాలా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఒక ఫ్రెంచ్‌ సినిమాకి రీమేక్‌ అయిన ఆ చిత్రాన్ని చేయవద్దని సమంత, చైతన్య వారించినా కానీ వర్కవుట్‌ అవుతుందంటూ నాగార్జున నటించాడట. పైగా మొహమాటపెట్టి సమంతతో అసలు ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర కూడా చేయించాడట. మావయ్య ఇప్పటి ట్రెండుని స్టడీ చేయకుండా బ్లండర్స్‌ చేస్తున్నారని సమంత కంప్లయింట్‌ చేస్తోందట. ఆమె ప్రోద్బలం వలనే చైతన్య 'బంగార్రాజు' ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేసి శేఖర్‌ కమ్ముల సినిమా చేస్తున్నాడనే రూమర్‌ కూడా వుంది.

 'సోగ్గాడే చిన్నినాయనా'కి సీక్వెల్‌ తీసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున అనుకుంటే ఆ ప్లాన్‌ ఫెయిల్‌ అయింది. బంగార్రాజు వెనక్కి పోయింది. ఇలా చైతన్య నటించే సినిమాల విషయంలో కూడా జోక్యం చేసుకుంటూ సమంత తమ బ్యానర్‌కి సహకరించడం లేదని నాగార్జున గుస్సా అవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బంగార్రాజు షూటింగ్‌ వాయిదా పడడం వల్ల ప్రస్తుతానికి నాగార్జునకి బిగ్‌బాస్‌ తప్ప మరో పని లేకుండా పోయిందని, తన స్టూడియోపై ఏదో ఒక సినిమా చేసే కొడుకులు కూడా పక్క బ్యానర్లతో బిజీ కావడం నాగ్‌కి అసహనం కలిగిస్తోందని రూమర్స్‌ వున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English