గ్యాంగ్‌లీడర్‌ ట్రెయిలర్‌ అదుర్స్‌

గ్యాంగ్‌లీడర్‌ ట్రెయిలర్‌ అదుర్స్‌

గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌ విని, అయిదుగురు ఆడవాళ్ల తరఫున రివెంజ్‌ తీసుకునే పాత్రలో నాని నటిస్తున్నాడని తెలిసి ఇదేదో సీరియస్‌ సినిమా అనేసుకున్నారు కానీ టీజర్‌తో ఇదో ఫన్‌ సినిమా అనే క్లారిటీ వచ్చేసింది. మూడు రోజుల్లో విడుదలయ్యే ట్రెయిలర్‌తో ఈ చిత్రం ఇంకెంత వినోదాత్మకంగా వుందనేది తెలియనుంది. ఈ ట్రెయిలర్‌ చూసిన వారు గ్యాంగ్‌లీడర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ష్యూర్‌ షాట్‌ హిట్‌ అంటూ కితాబులు ఇచ్చేస్తున్నారు.

హాలీవుడ్‌ సినిమాల డివిడిలు చూసి కాపీ కథలతో పుస్తకాలు రాసే రైటర్‌గా ఇందులో నాని కనిపిస్తాడు. అతనికి అనుకోకుండా రివెంజ్‌ కోసం చూస్తోన్న అయిదుగురు ఆడాళ్లకి సహకరించే ఒక బాధ్యత చేతికి వస్తుంది. వారి రివెంజ్‌ తీర్చుకోవడానికి సహకరిస్తూ అదే నవలగా రాసేయాలని భావిస్తాడు. కానీ అతనికి కనీస స్కిల్స్‌ కూడా లేకపోవడంతో పాటు ఈ 'రివెంజర్స్‌' బ్యాచ్‌ అంతా కూడా శుద్ధ అమాయకపు సంత కావడంతో మరింత ఇక్కట్లు పడతాడు. ఇంతలో ఒక పవర్‌ఫుల్‌ విలన్‌ని ఢోకొనాల్సిన పరిస్థితి రావడంతో ఆ రైటర్‌ ఎలా మారతాడు అనేది గ్యాంగ్‌లీడర్‌ కథ.

ఏది చేసినా కొత్తగా చేసే విక్రమ్‌ కుమార్‌ ఒక రివెంజ్‌ స్టోరీకి కూడా తనదైన వెరైటీ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి, నాని మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా వుండేట్టు చూసుకోవడంతో గ్యాంగ్‌లీడర్‌ గ్యారెంటీ హిట్‌ అనే టాక్‌ అయితే బ్రహ్మాండంగా స్ప్రెడ్‌ అవుతోందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English