అప్పుల ఊబిలో ప్ర‌కాష్ రాజ్‌?

అప్పుల ఊబిలో ప్ర‌కాష్ రాజ్‌?

దాదాపు రెండు ద‌శాబ్దాలు విరామం లేకుండా సినిమాలు చేశాడు ప్ర‌కాష్‌. రాజ్ ద‌క్షిణాదిన బ‌హు భాష‌ల్లో ఆయ‌న టాప్ ఆర్టిస్టుగా కొన‌సాగాడు. సౌత్‌లో అత్య‌ధిక పారితోష‌కం అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో ఆయ‌న ఒక‌రు. ఐతే కొన్నేళ్లుగా ప్ర‌కాష్ రాజ్‌కు అంత‌గా డిమాండ్ ఉండ‌ట్లేదు. అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ఆదాయం ప‌డిపోయింది. ఈ స‌మ‌యంలోనే మొద‌టి భార్య‌కు విడాకులిచ్చి పెద్ద మొత్తంలో ఆస్తులు రాసిచ్చిన‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి.

మ‌రోవైపు తాను ద‌త్త‌త తీసుకున్న తెలంగాణ ప‌ల్లెల కోసం కొన్ని కోట్లు ఖ‌ర్చు చేశాడు. ఇంకా రాజ‌కీయాల్లోకి దిగి కొంత‌మేర డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకున్నాడు. మ‌ధ్య‌లో కొన్ని సినిమాలు సొంతంగా నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. మొత్తంగా ప్ర‌కాష్ రాజ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ప‌డ్డాడ‌ని, అప్పుల బాధ‌తో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని క‌ర్ణాట‌క మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

తెలుగు-త‌మిళ భాష‌ల్లో రూపొందించిన ఉల‌వచారు బిరియాని సినిమాను ప్ర‌కాష్ రాజ్ హిందీలో త‌డ్కా పేరుతో రీమేక్ చేయ‌డానికి కొన్నేళ్ల కింద‌ట రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యినా విడుద‌ల‌కు నోచుకోకుండా ఆగిపోయింది. ఐతే ఈ సినిమాలో భాగ‌స్వామి అయిన ఎస్సెల్ విజ‌న్‌తో ఒప్పందాన్ని ప్ర‌కాష్ రాజ్ బ్రేక్ చేశాడ‌ట‌. అందుకుగాను వారికి రూ.6 కోట్ల దాకా చెల్లించాల్సి ఉండ‌గా.. కోర్టు ఆదేశాల త‌ర్వాత కూడా చెల్లింపు జ‌ర‌గ‌లేదు.

ప్ర‌కాష్ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయి. ఆ సినిమా విడుద‌ల‌కు నోచుకోక పెట్టిన ఖ‌ర్చంతా వృథా అయింది. దీనికి తోడు ఎస్సెల్ సంస్థ‌కు డ‌బ్బులివ్వాలి. ప్ర‌కాష్ రాజ్ లాంటి వాడికి ఇదేమంత పెద్ద విష‌యం అనిపిస్తుంది కానీ.. కోర్టు ఒక‌టికి రెండుసార్లు హెచ్చ‌రించినా ఆయ‌న డ‌బ్బులు ఇవ్వ‌లేక‌పోయాడంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English