అఖిల్‌ని ఫ్లాప్‌ హీరో అనేస్తున్నారట

అఖిల్‌ని ఫ్లాప్‌ హీరో అనేస్తున్నారట

నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌ హీరో కాక ముందు నెక్స్‌ట్‌ సూపర్‌స్టార్‌ అవుతాడని భావించారు. ఇంకా నటుడిగా తొలి చిత్రం అయినా రాకుండానే అఖిల్‌తో పలు బ్రాండ్లు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. కట్‌ చేస్తే... మూడు సినిమాల తర్వాత అఖిల్‌తో నటించడానికి ఏ ప్రముఖ హీరోయిన్‌ ఆసక్తి చూపించడం లేదు.

అఖిల్‌కి కనీసం పదిహేను కోట్లు కూడా రాబట్టే సత్తా లేదనే ఫీలింగ్‌తో అతడిని చిన్న హీరోగానే టాప్‌ హీరోయిన్లు పరిగణిస్తున్నారు. ఈ కారణంగానే అతని మలి చిత్రానికి ఇంతవరకు హీరోయిన్‌ ఖరారు కాలేదు. కాస్త పేరున్న ఏ హీరోయిన్‌ అయినా కానీ ఫ్లాప్‌ హీరోతో ఏమి నటిస్తామని అనేస్తున్నారట. లేదా ఆఫర్‌ని కాదనలేక భారీ పారితోషికం డిమాండ్‌ చేసి నిర్మాతలని బెదరగొడుతున్నారట.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా టాప్‌లో వున్న వారెవరైనా నటిస్తే బాగుంటుందని, అందుకోసం ప్రయత్నించమని నాగార్జున, అఖిల్‌ నిర్మాతలకి చెప్పారట. కథ ప్రకారం కూడా హీరోయిన్‌కి వెయిట్‌ ఎక్కువ కనుక అలాంటి ఇమేజ్‌ వున్న వారి కోసమే చూస్తున్నారట. కానీ ఇప్పటికి అయితే వేట ఇంకా ముగియలేదు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English