కాజల్‌ రేటుకి ఆమె దొరికేసింది

కాజల్‌ రేటుకి ఆమె దొరికేసింది

సాహో చిత్రంలో బ్యాడ్‌ బాయ్‌ సాంగ్‌ ఇప్పుడు కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. స్పెషల్‌ సాంగ్‌గా చిత్రీకరించిన ఈ పాటలో జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ నటించింది. ఈ పాటని కాజల్‌ అగర్వాల్‌తో తీద్దామని భావించారు.

కానీ ఐటెమ్‌ సాంగ్‌లో అవకాశం అనేసరికి, అందునా అయిదు భాషల్లో విడుదల చేసే చిత్రమనే సరికి కాజల్‌ అత్యాశకి పోయింది. ఈ పాట చేయడానికి రెండు కోట్లు కావాలని డిమాండ్‌ చేసింది. కాజల్‌కి అంత ఇచ్చే బదులు ఎవరైనా బాలీవుడ్‌ తార దొరుకుతుందని భావించి సాహో నిర్మాతలు వేరే వారి కోసం ప్రయత్నాలు చేయగా, రెండు కోట్లకి ఆ పాట చేయడానికి జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ ఒప్పుకుంది.

కాజల్‌ కనుక తెలివిగా ఆలోచించి అత్యాశకి పోకుండా రీజనబుల్‌ రేట్‌ చెప్పినట్టయితే ఇంత పెద్ద సినిమాలో భాగమై వుండేది. ఇటీవల కాజల్‌ తీసుకుంటోన్న నిర్ణయాలన్నీ బ్యాక్‌ఫైర్‌ అవుతున్నాయి. సీత చిత్రంలో నటించానికి చాలా సినిమాలు వదిలేసుకోగా అది డిజాస్టర్‌ అయింది.

రణరంగం చిత్రంలో చేసిన పాత్ర కూరలో కరివేపాకు మాదిరిగా తయారయింది. తమిళంలో చేసిన ప్యారిస్‌ ప్యారిస్‌ చిత్రం సెన్సార్‌ కత్తెరకి చిక్కుకుని విలవిల్లాడుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English