గుర్తుప‌ట్ట‌లేని విధంగా ఆ హీరో

గుర్తుప‌ట్ట‌లేని విధంగా ఆ హీరో

కొన్నేళ్లుగా త‌మిళ క‌థానాయ‌కుడు అజిత్ పేరు విన‌గానే.. అస‌లేమాత్రం ఫిట్‌నెస్ లేని భారీ అవ‌తారం.. 60-70 ఏళ్ల వాళ్ల‌ను  తెల్ల‌టి జుట్టు, గ‌డ్డం గుర్తుకు వ‌స్తాయి. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే ఫీలింగ్‌ను మార్చేశాడ‌త‌ను. ఓప‌క్క జ‌ట్టు కాస్త తెల్ల‌బ‌డినా.. రంగేసుకుని మేనేజ్ చేసే హీరోల్ని చూస్తున్న ఈ రోజుల్లో అజిత్ లాగా సినిమాతో సంబంధం లేకుండా తెల్ల‌టి జుట్టుతో క‌నిపించే వాళ్లు అరుదే.

ఒక‌టో రెండో సినిమాలంటే ఓకే కానీ.. కొన్నేళ్లుగా దాదాపు ప్ర‌తి సినిమాలోనూ ఇలాగే ద‌ర్శ‌న‌మిస్తున్నాడు అజిత్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన విశ్వాసం చిత్రంలో అయితే అజిత్ లుక్ మ‌రీ ఆడ్‌గా క‌నిపించింది. ఇటీవ‌ల వ‌చ్చిన నీర్కొండ పార్వై చిత్రంలో కూడా కాస్త అటు ఇటుగా అలాగే క‌నిపించాడు.

అజిత్ లుక్‌తో అభిమానుల‌కే బోర్ కొట్టేసిన ప‌రిస్థితుల్లో అత‌ను త‌ప్ప‌క మార్పు చూపించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఐతే త‌న కొత్త సినిమా కోసం అజిత్ లుక్ మార్చి అభిమానుల్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. నీర్కొండ పార్వై చిత్రాన్ని నిర్మించిన బోనీ క‌పూర్ బేన‌ర్లోనే ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వినోద్ డైరెక్ష‌న్లో ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేయ‌బోతున్నాడు అజిత్. ఆ చిత్రం కోసం బ‌రువు త‌గ్గడ‌మే కాదు.. గ‌డ్డం, మీసం తీసేశాడు.

జుట్టుకు రంగు కూడా వేశాడు. మొత్తంగా అవ‌తార‌మంతా మార్చేసి గుర్తు ప‌ట్ట‌లేని విధంగా త‌యార‌య్యాడు అజిత్. ఓ అభిమాని కొత్త లుక్‌లోకి మారిన‌ అజిత్‌తో ఫొటో దిగి దాన్ని సోష‌ల్ మీడియాలో పెట్టాడు. అది చూసి అజిత్ అభిమానుల ఆనందం మామూలుగా లేదు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్ల‌బోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English