‘బాహుబ‌లి’తో స్వేచ్ఛ పోయింది.. ‘సాహో’తో నిద్ర పోయింది

‘బాహుబ‌లి’తో స్వేచ్ఛ పోయింది.. ‘సాహో’తో నిద్ర పోయింది

బాహుబ‌లి ప్ర‌భాస్‌కు తిరుగులేని ఇమేజ్, మార్కెట్ తెచ్చిపెట్టిన సినిమా. సాహో ఆ ఇమేజ్, మార్కెట్‌ను అలాగే నిల‌బెట్టి ప్ర‌భాస్‌కు మ‌రింత ఫాలోయింగ్ తెచ్చిపెడుతున్న చిత్రం.

కానీ ఈ రెండు సినిమాలూ త‌న‌కెంతో ఇబ్బంది తెచ్చిపెట్టాయ‌ని అంటున్నాడు ప్ర‌భాస్. బాహుబ‌లి వ‌ల్ల త‌న స్వేచ్ఛ అంతా పోయింద‌ని అంటున్న యంగ్ రెబ‌ల్ స్టార్.. సాహో వల్ల నిద్రలేని రాత్రులు గడిపిన‌ట్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. సాహో ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత‌కీ అత‌ను ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేశాడంటే..

‘‘బాహుబలి వల్ల నాకు గుర్తింపు లభించి ఉండొచ్చు. కానీ స్వేచ్ఛ పోయింది. ఒకప్పుడు చాలా సార్లు ముంబయికి వెళ్లాను. నన్నెవరూ గుర్తు పట్టలేదు. కానీ ఇప్పుడు నన్ను గుర్తుపట్టి, దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా జ‌నాల‌కు, విదేశీయుల‌కు కూడా నేను తెలుసు. ఎక్కడికైనా, ఎప్పుడైనా వెళ్లే స్వేచ్ఛను కోల్పోయాను. రాజ‌మౌళి కార‌ణంగానే నేను చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. బాహుబ‌లి త‌ర్వాత‌ నా మీద అంచ‌నాలు పెరిగిపోయాయి. కొన్నిసార్లు ఇదంతా చూసి భయమేస్తోంది. ‘సాహో’ వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా, గడుపుతున్నా. ఈ సినిమా విడుద‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ప్ప‌టి నుంచి కంటిమీద కునుకు లేదు’’ అని ప్ర‌భాస్ చెప్పాడు.

బాహుబ‌లి, సాహో సినిమాల‌కు కలిపి ఐదారేళ్లు స‌మ‌యం వెచ్చించాక, ఎంతోక‌ష్ట‌ప‌డ్డాక ఇక‌పై కొన్నేళ్ల పాటు ఇలాంటి హై బ‌డ్జెట్ సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌భాస్ మ‌రోసారి నొక్కి వ‌క్కాణించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English