చిన్నప్పటి నుంచి అంతేనా తాప్సీ..?

చిన్నప్పటి నుంచి అంతేనా తాప్సీ..?

తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రముఖ నటి తాప్సీ ఒక ఆసక్తికర ఫోటోను పోస్ట్ చేవారు. అందులో ఆమె ఒక క్రీడా పోటీలో ఫస్ట్ ప్లేస్ సాధించిన వైనం కనిపిస్తుంది.

నటిగానే కాదు.. చదువుకునే రోజుల్లో స్పోర్ట్స్ లో తానెంత రాణించిన విషయాన్ని చెప్పకనే చెప్పేశారు తాప్సీ. ఈ సందర్భంగా అప్పటి స్కూల్ పరిస్థితుల గురించి చెబుతూ.. ఇప్పటి పరిస్థితుల మీద ఆవేదన వ్యక్తం చేశారు.  స్టూడెంట్ లైఫ్ లో గేమ్స్ ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెబుతూ.. తన జీవితంలో ఆటలు ఒక భాగంగా ఉండేవన్నారు.

ప్రతి ఏడాది నిర్వహించే క్రీడా పోటీల్లో రేస్ ట్రాక్ మీద పోటీ పడేదానినని.. అందుకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీకి.. ఫ్రెండ్స్ కు ఆమె థ్యాంక్స్ చెప్పారు. ఈ ఫోటోను పోస్ట్ చేసిన తర్వాత.. బాలీవుడ్ హీరో వికీ కౌశల్ కాస్తంత సరదాగా తాప్సీని ఆటపట్టిస్తూ.. కచ్ఛితంగా ఓ నలుగురైదుగురిని రేసులో పక్కకు నెట్టేసి ఉంటావ్ అంటే.. నా ముఖంలో కనిపిస్తున్న అమాయకత్వం చూశాక కూడా అలా ఎలా అంటావ్?  నేను నిజాయితీతో ఉండే స్పోర్ట్స్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చింది.

వీరి సంభాషణలోకి ఎంటరైన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ఏమైతేనేం నువ్వు ప్రైజ్ సాధించావుగా అంటూ వ్యాఖ్యానించారు. స్కూల్.. కాలేజీ లైఫ్ బాగుంటే.. తర్వాత తన జీవితం మరింత బాగుందంటూ బదులిచ్చారు తాప్సీ. మొత్తానికి తన నట జీవితాన్ని తానెంత ఎంజాయ్ చేస్తున్నారన్న విషయం తాప్సీ తాజా వ్యాఖ్యతో ఇట్టే అర్థమైపోవటం ఖాయం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English