స్వీట్ న్యూస్ చెప్పిన స్నేహ.. కంగ్రాట్స్ తో ఫుల్ బిజీ

స్వీట్ న్యూస్ చెప్పిన స్నేహ.. కంగ్రాట్స్ తో ఫుల్ బిజీ

స్వీట్ న్యూస్ చెప్పేశారు స్నేహ. తెలుగు.. తమిళ నటిగా సుపరిచితురాలైన ఆమె.. ఇటీవల ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాన్ని చెప్పారు. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లుగా వెల్లడించారు. స్నేహ నోటి నుంచి ఈ మాట వచ్చినప్పటి నుంచి ఆమె సన్నిహితులు.. స్నేహితులు.. బంధువులు.. అభిమానులు.. అందరూ ఆమెకు అభినందనలు చెప్పేయటం షురూ చేశారు.

దీంతో ఆమె ఇప్పుడు వరుస ఫోన్ కాల్స్.. మెసేజ్ లతో ఫుల్ బిజీగా మారారు. తమిళ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడి.. ఆ తర్వాత వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పటికే నాలుగేళ్ల బాబు ఉన్నాడు. తాజాగా మరోసారి తల్లి కాబోతున్న స్వీట్ న్యూస్ చెప్పారు స్నేహ.  

పెళ్లి తర్వాత రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమె.. ఆచితూచి అన్నట్లుగా పాత్రల ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి తల్లి కాబోతున్న నేపథ్యంలో నటనకు కాస్తంత పుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English