కెరీర్‌ను ఎంత చ‌క్క‌గా నాశ‌నం చేసుకున్నాడో..

కెరీర్‌ను ఎంత చ‌క్క‌గా నాశ‌నం చేసుకున్నాడో..

సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎప్పుడూ ప‌రిస్థితులు ఒక‌లా ఉండ‌వు. చేతిలో మూణ్నాలుగు సినిమాలున్నాయ‌ని.. క్రేజ్ ఉంద‌ని.. మిడిసిప‌డితే.. అంతే సంగ‌తులు. ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా కింద ప‌డిపోతుంటారు. త‌మ‌కు ఏం న‌ప్పుతుందో చూసుకుని ఆ ప‌రిధిలో ఉండ‌టం కూడా ముఖ్య‌మే. ఈ సంగ‌తి తెలియ‌క చాలామంది క‌మెడియ‌న్లు హీరోలుగా మారిపోయి వీరి విన్యాసాలు చేసి కెరీర్ల‌ను దెబ్బ తీసుకుంటున్నారు.

ఒక‌ప్పుడు ఆలీ హీరోగా ఎంత క్రేజ్ తెచ్చుకున్నా.. ఇదే కెరీర్ కాద‌ని అర్థం చేసుకుని మ‌ళ్లీ కామెడీ పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మై కెరీర్‌ను పొడిగించుకున్న విష‌యం గుర్తుంచుకోవాలి. సునీల్ ఈ విష‌యంలో చాలా ఆల‌స్యం చేశాడు. హీరోగా త‌న‌కు సూట్ కాని విన్యాసాల‌న్నీ చేశాడు. ప్రేక్ష‌కుల్లో నెగెటివిటీ పెంచుకుని ఇప్పుడు ఎటూ కాకుండా త‌యార‌య్యాడు.

ఐతే సునీల్‌కు క‌మెడియ‌న్‌గా హీరోల‌తో స‌మానంగా ఇమేజ్ ఉంది కాబ‌ట్టి అత‌ను కొంచెం అతి చేసినా ఓకే అనుకోవ‌చ్చు. కానీ క‌మెడియ‌న్‌గా స‌రిగా నిల‌దొక్కుకోకుండానే ష‌క‌ల‌క శంక‌ర్ అనేవాడు హీరో అవ‌తారం ఎత్త‌డ‌మే విడ్డూరం. క‌థానాయ‌కుడిగా త‌న తొలి సినిమా శంభో శంక‌ర గురించి ఓ రేంజిలో చెప్పుకున్నాడు. కానీ సినిమా చూసిన వాళ్లు ల‌బోదిబోమంటూ థియేట‌ర్ల నుంచి బ‌య‌టికొచ్చారు.

ఈ సినిమా మీద పెట్టిన డ‌బ్బుల్లో ఏమీ వెన‌క్కి రాలేదు. అయినా త‌గ్గ‌కుండా డ్రైవ‌ర్ రాముడు అని, నేనే కేడీ నంబ‌ర్ వ‌న్ అని హీరోగా రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. ఇందులో రెండో చిత్రం శుక్ర‌వారం రిలీజైంది. ఈ సంగ‌తి కూడా జ‌నాలకు తెలియ‌దు. దాని గురించి చ‌ర్చే లేదు. మ‌రి శంక‌ర్ ఈ సినిమా ఎందుకు చేసిన‌ట్లు? క‌మెడియ‌న్‌గా కాస్తో కూస్తో చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు వ‌స్తుంటే వాటిని స‌ద్వినియోగం చేసుకోకుండా హీరోగా న‌టించి ఏం సాధించిన‌ట్లు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English